అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌ షురూ.. స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..

Amazon- Flipkart: అమెజాన్‌, ఫ్లిప్‌కాట్‌ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్‌ మొదలయ్యాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి.

Published : 02 May 2024 16:46 IST

Amazon- Flipkart | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెజాన్‌ (Amazon) గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ (Great Summer Sale) ప్రారంభమైంది. నాన్ ప్రైమ్ మెంబర్లకు కూడా సేల్ అందుబాటులోకి వచ్చింది. సేల్‌లో ల్యాప్‌ట్యాప్, టీవీలు, అమెజాన్‌ డివైజ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై డిస్కౌంట్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డు దారులకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈఎంఐ సదుపాయం కూడా ఉందని కంపెనీ తన వెబ్‌సైట్లో పేర్కొంది.

గ్రేట్‌ సమ్మర్‌ సేల్లో భాగంగా ఐఫోన్‌ 13 (Apple iPhone 13) ఫోన్‌పై అమెజాన్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.59,900 కాగా.. ఈ ఫోన్‌ను రూ.48,499కే విక్రయిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్‌తో మరో వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఎక్ఛేంజ్‌లో రూ.44,250కే లభించనుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 (OnePlus Nord CE4) రూ.24,998కే కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్‌ ఆఫర్‌ ద్వారా వెయ్యి రూపాయల వరకు తగ్గింపు పొందొచ్చు.

ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్‌!

పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) సేల్‌లో మరింత తక్కువకే లభిస్తోంది. దీని ఎమ్మార్పీ ధర రూ.16,999 కాగా.. సేల్‌లో భాగంగా రూ.9,999కే విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా రూ.7వేలు డిస్కౌంట్‌ లభిస్తోంది. రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో రూ.10,499కే విక్రయిస్తున్నారు. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే మరింత తక్కువకు లభించే అవకాశం ఉంది. ఇక శాంసంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ (Samsung Galaxy M13 5G) రూ.10,999, రియల్‌మీ నార్జ్‌ 70 5జీ (Narzo 70 5G) రూ.14,999, ఐకూ జెడ్9 5జీ (iQOO Z9 5G) రూ.17,999, టెక్నో పాప్‌ 8 మొబైల్‌ రూ.6,119కే కొనుగోలు చేయొచ్చు. ఇక అమెజాన్ ఫైర్‌ టీవీ స్టిక్‌ 4కెని రూ.3,999కు, అమెజాన్‌ ఎకో పాప్‌ రూ.3,449కే లభిస్తోంది. 

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) సేల్ కూడా ఈరోజే ప్రారంభమైంది. ఈ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో మోటో ఎడ్జ్‌ 50 ప్రో రూ.27,999కే లభించనుంది. రియల్‌మీ పీ1 ప్రో రూ.19,999, వివో టీ2 ప్రో 5జీ రూ.20,999కే కొనుగోలు చేయొచ్చు. పోకో ఎక్స్‌6 ప్రో 5జీ రూ.22,999, రెడ్‌మీ నోట్‌ 13ప్రో 5జీ రూ.21,999 కే లభించనుంది. ఆఫర్‌ సమయంలో ఇన్ఫినిక్స్‌ నోట్ 40 ప్రో5జీ రూ.19,999, ఒప్పో ఫైండ్ ఎన్‌3 ఫ్లిప్‌ రూ.49,999 కొనుగోలు చేయొచ్చు. రియల్‌మీ 12 ప్రో రూ.22,999, మోటోరొలా ఎడ్జ్‌ 40 నియో రూ.19,999 లభిస్తుంది. ఇక కార్డ్ ఆఫర్ల విషయానికొస్తే.. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని