Warangal: ఘాటెక్కిన ఎర్రబంగారం .. మార్కెట్‌ చరిత్రలో గరిష్ఠ ధర నమోదు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశీయ రకం మిర్చి మార్కెట్ చరిత్రలో మొదటిసారిగా రూ. 44 వేల

Updated : 17 Mar 2022 17:00 IST

వరంగల్‌: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశీయ రకం మిర్చి మార్కెట్ చరిత్రలో మొదటిసారిగా (క్వింటా) రూ. 44 వేల గరిష్ఠ ధర పలికింది. సింగిల్ పట్టి రకం రూ.42,500 ధర పలికినట్టు మార్కెట్ అధికారులు వివరించారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది మిర్చి ధరలు ఉన్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. మిర్చి దిగుబడి లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ ఉండటం కారణంగా మిరప ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని వ్యాపారులు తెలిపారు. నన్ని తెగులు ఆశించి ఈ ఏడాది మిర్చి దిగుబడి సగానికి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా.. మిరప ధర మాత్రం ఆశాజనకంగా ఉందని రైతులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని