Kamareddy: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియ నిలిపివేత

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్ను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

Published : 20 Jan 2023 16:04 IST

కామారెడ్డి: కామారెడ్డి పట్టణ బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మాస్టర్‌ ప్లాన్‌ను నిలిపివేస్తామని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ విషయమై కామారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, కమిషనర్‌తో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని.. ఆ మేరకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తామని అధికారులు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ సుమారు నెలన్నర రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రక్రియను నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని