Hyderabad: విషమంగానే ప్రీతి ఆరోగ్యం: బులెటిన్‌ విడుదల చేసిన నిమ్స్‌ సూపరింటెండెంట్‌

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు.

Updated : 24 Feb 2023 23:49 IST

హైదరాబాద్‌: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు. ‘‘ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ఆమెకు ప్రత్యేక వైద్యుల బృందం ఆధ్వర్యంలో వైద్యం అందిస్తున్నాం’’ అని నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. మరోవైపు నిమ్స్‌కు వెళ్లిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ఆమెకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి బయటకు వెళుతున్న సమయంలో మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ను బీఎస్పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రీతికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పంజాగుట్ట ఠాణాకు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని