KTR: మౌలిక సదుపాయాలు కల్పించడంలో హైదరాబాద్‌ ముందుంది: కేటీఆర్‌

భారత్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ ముందుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల

Updated : 12 May 2022 13:52 IST

హైదరాబాద్‌: భారత్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ ముందుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన ‘కాల్‌అవే’ గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ అమెరికాలోని శాండియాగోలో కాల్‌అవే సంస్థ క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉందన్నారు. రెండో కార్యాలయం కోసం తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషమని చెప్పారు. రాష్ట్రంలో డిజిటల్‌ కంపెనీలు చాలా ఉన్నాయని.. ప్రఖ్యాత యాపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు రెండో పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయని కేటీఆర్‌ గుర్తుచేశారు. కాల్‌అవే భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. గోల్ఫ్‌తోపాటు పార్టీలకు వేదికలు, స్పోర్ట్ బార్లు, రెస్టారెంట్లు నిర్వహించే టాప్‌ గోల్ఫ్‌కు హైదరాబాద్‌ ఎంతో అనువైన ప్రదేశమని చెప్పారు. పెట్టుబడులు పెడతామంటే ప్రభుత్వం తరఫున అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని కేటీఆర్‌ చెప్పారు. 

రాయదుర్గంలో కాల్‌అవే అతిపెద్ద డిజిటెక్‌ కేంద్రాన్ని రూ.150కోట్లతో ఏర్పాటు చేశారు. దీని ద్వారా సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని