పెంపుడు జంతువులకూ ఉచిత కరోనా పరీక్ష

పెంపుడు జంతువులకు ఉచితంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలునిర్వహిస్తున్నారు.

Updated : 09 Feb 2021 05:13 IST

సియోల్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో శునకాలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఉచితంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలునిర్వహిస్తున్నారు. కరోనా సోకిన మనుషులకు సమీపంలోకి వెళ్లిన జంతువులకు, కరోనా లక్షణాలు కనిపించే వాటికి ఈ వెసులుబాటు కల్పించారు.

ఈ దేశంలోని జంజు నగరానికి చెందిన ఓ మత సంస్థలో సభ్యులైన మహిళకు, ఆమె కుమార్తెకు కొవిడ్‌ సోకింది. అనంతరం వారి పెంపుడు పిల్లికి కూడా కరోనా వచ్చినట్టు తేలింది. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువుల్లో కరోనాకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా జంతువులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయితే.. వాటిని ఇంటిలో లేదా పురపాలక సంస్థ ఏర్పాటుచేసిన శరణాలయంలో పధ్నాలుగు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని ఇతర నగరాల్లో కూడా పెంపుడు జంతువులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

నిజానికి జంతువుల వల్ల మనుషులకు కరోనా సోకినట్టు ఆధారాలేవీ లేవని.. అందుకే తాము అన్ని జంతువులకు కాకుండా, మనుషులకు సమీపంగా మసిలే పెంపుడు జీవులకు మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనల అమలు కఠినం చేయటంతో.. దక్షిణ కొరియాలో రోజువారీ కరోనా కేసులు  సోమవారం నాటికి 300 కంటే దిగువకు చేరుకున్నాయి.

ఇవీ చదవండి..

ఆ వూరిలో అంతా మహిళలే..

ఉత్తరాఖండ్‌ జల ప్రళయానికి కారణమేంటి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని