Smriti Irani: పోటీపడాలంటే.. అద్దంలో మిమల్ని మీరు చూడండి!
సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇచ్చే సందేశాలకు చాలా క్రేజ్ ఉంటుంది. స్ఫూర్తిదాయకం, ఫన్నీ, ఆలోజింపజేసే విషయాలను ఆమె నెటిజన్లతో పంచుకోవడమే అందుకు కారణం. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్మృతి చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇచ్చే సందేశాలు సందేశాత్మకంగా ఉంటాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్మృతి చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. తన సెల్ఫీని కారు అద్దంలో బంధించి.. సందేశాన్ని ఇచ్చారామె. ‘‘పోటీకోసం ఎవరినో చూడాల్సిన పనిలేదు. మీకు మీరే పోటీగా భావించి ముందుకు దూసుకుపోవాలి. అదే మిమల్ని ప్రతిబింబిస్తుంది’’ అంటూ కామెంట్ పెట్టారు. రాజకీయ నేతల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారిలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 11లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. గతంలోనూ ఆమె ఇచ్చిన పలు సందేశాలు అందరిని ఆకర్షించాయి ‘‘ఆమెకు ఒక హీరో కావాలి. దాంతో ఆమే హీరోగా మారింది ’’ అంటూ స్ఫూర్తి కోసం ఇతరులవైపు చూడాల్సిన అవసరం లేదని.. తమకి తామే హీరోలై.. ఇతరులకు ఆదర్శంగా నిలవొచ్చని అమ్మాయిలకు ఉద్దేశించి చెప్పారు. ఆడపిల్లల విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ.. ‘మీ కుమార్తెలు స్వేచ్ఛగా ఎగిరేందుకు రెక్కలివ్వండి’ అంటూ వ్యాఖ్యను జోడించిన వీడియో గతంలో ‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ’ అంటూ ఓ చిన్నారి కోరుకుంటున్న విషయాన్ని బయటపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!