Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్‌ సంస్థ

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది.సింటెక్స్‌.. తన తయారీ యూనిట్‌ ను రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం చందన్‌పల్లిలో ఏర్పాటు చేయనుంది.

Published : 23 Sep 2023 21:51 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. సింటెక్స్‌ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వెల్‌స్పన్‌ గ్రూప్‌ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్‌.. తన తయారీ యూనిట్‌ ను రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం చందన్‌పల్లిలో ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు వెయ్యి ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్‌ వాటర్‌ ట్యాంకులు, ప్లాస్టిక్‌ పైపులు, ఆటో కాంపొనెంట్స్‌ ఇతర పరికరాలు తయారు చేయనున్నారు. ఈనెల 28న వెల్‌స్పన్‌ కంపెనీ ఛైర్మన్‌ బీకే గోయెంకా, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని