Sonu Sood: ‘మీ వెంటే నేను’.. అమరావతి రైతులకు సోనూసూద్‌ మద్దతు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 632 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సినీనటుడు సోనూసూద్‌ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు

Updated : 09 Sep 2021 17:44 IST

అమరావతి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 632 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సినీనటుడు సోనూసూద్‌ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూసూదన్‌ను గన్నవరం విమానాశ్రయంలో మహిళా రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరగా... రైతుల వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి దీక్షా శిబిరాల్లో నిరసన తెలిపారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్‌

కరోనా కష్టకాలం నుంచి ప్రజలంతా కోలుకుని తిరిగి సాధారణ జీవనం సాగించేలా కనకదుర్గమ్మ తన చల్లని ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్టు సోనూసూద్‌ తెలిపారు.  విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో సోనూసూద్‌కు స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది .. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని