Ts News: ఆ పోస్టులకు బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులూ అర్హులే: హైకోర్టు

తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థుల అర్హతపై ఉన్నత  న్యాయస్థానంలో విచారణ

Published : 20 Dec 2021 19:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థుల అర్హతపై ఉన్నత  న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ అభ్యర్థులు అర్హులని తీర్పునిస్తూ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను కొట్టివేసింది. బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని.. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని సంబంధిత శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని