Ap Corona: ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 24కి పెరిగింది. ఒమిక్రాన్‌

Updated : 04 Jan 2022 21:32 IST

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 24కి పెరిగింది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో ఒమన్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్‌ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్‌, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఒమిక్రాన్‌ బాధితుల్లో ముగ్గురు కృష్ణా జిల్లా వాసులు, పశ్చమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 28,311 పరీక్షలు నిర్వహించగా.. 334 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,77,942కు చేరాయి. కొవిడ్‌ వల్ల నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,499కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 95 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,927 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1,516 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని