AP News: మద్యం మత్తులోనే పాఠశాలకు హెచ్‌ఎం.. విద్యార్థుల నానా అవస్థలు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జోగుతూ పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలోనే తూలి పడిపోయాడు. పిల్లలు అతన్ని ‘లేవండి సారు...’ అంటూ బతిమిలాడినా ఫలితం లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరవలస ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు మంగళవారం మద్యం తాగి విధులకు హాజరయ్యారు. కనీసం నిల్చోలేని

Updated : 01 Dec 2021 07:05 IST

శ్రీకాకుళం(వంగర), న్యూస్‌టుడే: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జోగుతూ పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలోనే తూలి పడిపోయాడు. పిల్లలు అతన్ని ‘లేవండి సారు...’ అంటూ బతిమిలాడినా ఫలితం లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరవలస ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు మంగళవారం మద్యం తాగి విధులకు హాజరయ్యారు. కనీసం నిల్చోలేని స్థితిలో నేలపైనే కూర్చుండిపోయాడు. విద్యార్థులు మధ్యాహ్నం వరకు ఉండి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ మరో ఉపాధ్యాయురాలు ఉండగా ఆమె సెలవులో ఉన్నారు. ఎంఈవో దుర్గారావు మాట్లాడుతూ... ప్రధానోపాధ్యాయుడిపై గతంలో ఒకసారి ఫిర్యాదు అందిందని, డీఈవోకు నివేదికను ఇచ్చామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని