Ts News: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ‘సన్‌ డే-ఫన్‌ డే’, ‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ నిలిపివేత

భాగ్యనగరంలో ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తోన్న ‘సన్‌ డే-ఫన్‌ డే’ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. అలాగే.. పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద

Published : 11 Dec 2021 01:21 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తోన్న ‘సన్‌ డే-ఫన్‌ డే’ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. అలాగే.. పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద ప్రతి ఆదివారం జరిగే ‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ కార్యక్రమాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చే వరకు ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌ డే-ఫన్‌ డే కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి వారం ప్రత్యేక షోలు నిర్వహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘సన్‌ డే-ఫన్‌ డే’ కార్యక్రమం మాదిరిగా చార్మినార్‌ వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు ప్రతి ఆదివారం చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చార్మినార్‌ అందాలతో పాటు వివిధ రకాల స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా పురపాలక శాఖ ఆదేశాల మేరకు ఈ రెండు కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని