Vizag steel plant: విశాఖస్టీల్‌ విక్రయం దిశగా కేంద్రం వేగంగా అడుగులు

ఇటీవల కాస్త స్తబ్దుగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశం మళ్లీ వేడెక్కింది. స్టీల్‌ ప్లాంట్‌ విక్రయం దిశగా వేగంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ..

Updated : 24 Sep 2021 22:23 IST

విశాఖపట్నం: ఇటీవల కాస్త స్తబ్దుగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశం మళ్లీ వేడెక్కింది. స్టీల్‌ ప్లాంట్‌ విక్రయం దిశగా వేగంగా కేంద్రం అడుగులు వేస్తోంది. న్యాయ సలహాదారు ఎంపిక ప్రక్రియ కోసం న్యాయసంస్థలకు పిలుపు నివ్వగా.. ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఐదు సంస్థలతో కూడిన తుది జాబితాను కేంద్రం రూపొందించింది. ఈనెల 30న ప్రజెంటేషన్‌ ఇవ్వాలని ఐదు సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో న్యాయసలహాదారు ఎంపిక పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. న్యాయ, ట్రాన్సాక్షన్‌ సలహాదారుల ఎంపిక తర్వాత స్టీల్‌ ప్లాంట్‌ విక్రయ ప్రక్రియ ప్రారంభం కానుంది. విశాఖ ఉక్కు 100శాతం అమ్మకంపై ఆర్థికశాఖ తదుపరి కార్యాచరణ చేపట్టనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని