tenali: కష్టకాలంలో ఉచిత ఆహార పంపిణీ

అవసరంలో ఉన్నవారి ఆకలి తీర్చడం అంటే దేవుడికి నైవేద్యం పెట్టినట్టే. ఈ మాటను అక్షరాల పాటిస్తుంది తెనాలిలోని ఓ కుటుంబం.

Updated : 11 Jul 2021 16:24 IST

అమరావతి: అవసరంలో ఉన్నవారి ఆకలి తీర్చడం అంటే దేవుడికి నైవేద్యం పెట్టినట్టే. ఈ మాటను అక్షరాల పాటిస్తుంది తెనాలిలోని ఓ కుటుంబం. గతేడాది లాక్‌డౌన్‌లో వందలాది పేదల కడుపు నింపిన వారు ఇప్పుడు కొవిడ్‌ బారిన పడ్డ వారి ఇంటికే ఆహారాన్ని అందిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శ్రీ రామాయణ నవాహ్నిక జ్ఞాన యజ్ఞం ట్రస్ట్‌ వ్యవస్థాపకులు విష్ణుభట్ల ఆంజనేయచయానికీయాజులు తన ఇద్దరు కుమారులతో కలిసి వందలాది ప్రజల ఆకలి తీరుస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ 120 రోజుల పాటు నిత్యం అన్నదానం చేసిన ఈ కుటుంబం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. కరోనా సోకి హోం ఐసోలేషన్‌ ఉంటున్న వారికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. భోజనాన్ని స్వయంగా తయారు చేయడటమే కాకుండా, దాన్ని ప్యాక్‌చేసి పట్టణ నలుమూలల్లో ఎవరడిగినా వారికి చేరవేస్తున్నారు. ఎవరు ఎంత ఆహారం అడిగినా లేదనకుండా పంపిణీ చేస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని