Andhra News: పెద్దపులి పిల్లల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. 

Updated : 06 Mar 2023 10:48 IST

నందికొట్కూరు గ్రామీణం: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు వాటిని గమనించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. ఒకేసారి 4 పిల్లలు కనిపించడంతో వాటి తల్లి పెద్దపులి మళ్లీ వస్తుందేమోనని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పులి పిల్లలను తీసుకొచ్చి ఓ గదిలో ఉంచి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని