Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 22 Apr 2023 17:17 IST

1. మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు: హరీశ్‌రావు

దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆయన లేఖ రాశారు. దేశ భద్రత, వేలాది మంది ఉద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి55.. ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి55 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘2024 వరకు ఎందుకు..?’ సీఎం పదవిపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌(Ajit Pawar)రాజకీయంగా ఎలాంటి స్టెప్‌ వేయనున్నారనే వార్తలు.. ఇప్పుడు మహారాష్ట్ర(Maharashtra)లో ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి గురించి ఆయన ఓ మీడియాకు ఇచ్చిన సమాధానమే అందుకు కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వేధిస్తున్నారని చెబితే.. వేటు వేశారు! వివాదంలో కాంగ్రెస్‌

అస్సాం (Assam) యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అంకిత దత్తా (Angkita Dutta)పై కాంగ్రెస్‌ (Congress) పార్టీ వేటు వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పార్టీలో కొందరు తనను వేధిస్తున్నారంటూ అంకిత ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భాజపా (BJP) స్పందిస్తూ.. హస్తం పార్టీకి చురకలంటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అర్జున్‌ ఎప్పుడైనా మిమ్మల్ని ఔట్‌ చేశాడా..?నెటిజన్‌ ప్రశ్నకు సచిన్‌ సమాధానమిదే..!

సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి.. ముంబయి తరఫున రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆడిన రెండో మ్యాచ్‌లోనే ఒత్తిడిని అధిగమించి డెత్‌ ఓవర్‌లో బౌలింగ్‌ చేశాడు. ప్రత్యర్థిని కట్టడి చేయడమే కాకుండా తొలి వికెట్‌ కూడా సంపాదించాడు. దీంతో అతడి ప్రదర్శనను పలువురు మెచ్చుకుంటూ.. తండ్రిగా సచిన్‌ కూడా గర్వపడాలని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఎప్పుడూ మా అమ్మ చెప్పే మాట అదే’: జీవిత పాఠం చెప్పిన ఓయో సీఈఓ

కెరీర్‌లో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్పే అనుభవ పాఠాలు యువతలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతూ ఉంటాయి. ఓయో(OYO) సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌(Ritesh Agarwal).. తన అమ్మ చెప్పిన మాటను ఐఐఎం నాగ్‌పుర్ విద్యార్థులతో పంచుకున్నారు. ఐఐఎంలో ఇటీవల రితేశ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మోదీ పర్యటన వేళ ‘ఆత్మాహుతి దాడి’ బెదిరింపులు.. కేరళలో హైఅలర్ట్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) కేరళ పర్యటనకు  (Kerala Visit) బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రధాని పర్యటన సమయంలో ఆత్మాహుతి దాడులు (suicide attack) జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాంగ్రెస్‌ అభ్యర్థుల దరఖాస్తుల తిరస్కరణకు కుట్ర : డీకే శివకుమార్‌

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల దరఖాస్తుల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు  ముఖ్యమంత్రి కార్యాలయం వివిధ జిల్లాల నుంచి రిటర్నింగ్‌ అధికారులను పిలవటాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ర్ట కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వెయ్యికిపైగా యుద్ధఖైదీలతో మునిగిన నౌక.. 81 ఏళ్లకు ఆచూకీ లభ్యం!

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యికిపైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన ఓ జపాన్‌ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ ద్వీప తీరంలో దక్షిణ చైనా సముద్రంలో 4 వేలకుపైగా మీటర్ల లోతులో ‘ఎస్‌ఎస్‌ మాంటెవీడియో మారు’ నౌక ఆచూకీ లభించినట్లు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ శనివారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లేఆఫ్‌ల వేళ.. సుందర్‌ పిచాయ్‌కి ₹1850కోట్ల పారితోషికం

గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ 2022 సంవత్సరానికి గానూ 226 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కంపెనీలో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని