Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 28 Jun 2023 09:02 IST

1. విశాఖలో ‘ఇన్ఫోసిస్‌’ షురూ..

విశాఖపట్నంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఎంప్లాయి లీడర్‌షిప్‌ కనెక్ట్‌’ పేరుతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జులై 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని ఐటీ పార్కులోని హిల్‌-2, 3 జంక్షన్‌లో మౌరి టెక్‌ ఎదురుగా సిగ్నిటీ టవర్స్‌ భవన్‌లో ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ రెండు షిఫ్టులలో 1400 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మూడేళ్ల అనుభవం.. 30 కి.మీ. తప్పనిసరి

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్ట్‌ టెండరు నిబంధనల రూపకల్పనలో మెట్రో వర్గాలు పకడ్బందీగా వ్యవహరించాయి. హైదరాబాద్‌ విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో(హెచ్‌ఏఎంఎల్‌) సంస్థ విధించిన షరతులు కఠినంగా ఉన్నాయని.. బిడ్డింగ్‌కు అర్హత సాధించే సంస్థలు తక్కువగా ఉంటాయని ఇన్‌ఫ్రా సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. బిడ్‌లో పాల్గొనాలంటే ఇది వరకు 30 కి.మీ. మెట్రో రైలు పనులు చేపట్టిన అనుభవం ఉండాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒక మిరపకాయ రూ.3.. ఒక టమాటా రూ.5

హైదరాబాద్‌: టమాటా ధర ఈ నెల ప్రారంభంలో కిలో రూ.15 ఉండేది. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఏకంగా రూ.100 దాటేసింది. కొన్నిచోట్ల రూ.120కి కూడా విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కూడా రూ.100-120కి చేరింది. హనుమకొండలో ఏకంగా రూ.200కి కూడా విక్రయిస్తున్నారు. ఇవేకాదు.. ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయలు, ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. గ్రామాల నుంచి నగరాల దాకా అన్నిచోట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Hyderabad: గ్యాస్‌ కావాలా.. వాట్సాప్‌ చేస్తే చాలు

హైదరాబాద్‌: కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ కోసం లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారా..? ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారా..? ఇక ఆ ప్రయాస అవసరం లేదు. వాట్సాప్‌లో ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు కొత్త కనెక్షన్‌ సులభంగా పొందొచ్చు. వినియోగదారుల కోసం వాట్సాప్‌ సేవలు తీసుకొచ్చినా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. యిల్‌ కంపెనీల వాట్సాప్‌ నంబర్లతో సైతం వినియోగదారులు క్షణాల్లో బుకింగ్‌, రీఫిల్లింగ్‌, ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కూర్చోబెట్టండి.. రూ.కోట్లు కురిపిస్తాం

కోరుకున్న చోట పోస్టింగ్స్‌ కోసం పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి వరుస కడుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో జనావాస విస్తరణతో భూములకు గిరాకీ పెరిగింది. రూ.కోట్లు పలికే భూ వివాదాలతో లాభపడొచ్చనే ఆలోచన కూడా దీనికి కారణం కావచ్చని ఓ పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించడం పరిస్థితికి అద్దంపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘గుట్ట’క్కమన్నా.. ఆపేదెవరు?

అది ఓ గుట్ట. చిత్తూరు నగరంలో జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. రూ.10 కోట్ల విలువైన భూమిపై స్థానిక వైకాపా నాయకులు కన్నేశారు. కబ్జా చేసి మామిడి మొక్కలు నాటినా అడగాల్సిన, అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుందే తప్ప చర్యలు తీసుకోవడానికి మాత్రం సాహసం చేయలేదు. ఉన్నతాధికారులైనా రంగంలోకి దిగి కబ్జాకు గురైన గుట్టను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పేదలకు గృహలక్ష్మి అనుగ్రహం!

సొంతిల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ విషయాన్ని ఆలోచించరు. ఈ నేపథ్యంలో వీరి ఆకాంక్షను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే కొన్ని చోట్ల మాత్రమే వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో కొందరికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎన్ని విచిత్రాలో..

ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి. ప్రస్తుతం వరుస క్రమం తప్పడంతో ఎవరి ఓటు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జాబితా మొత్తం పరిశీలిస్తే తప్ప.. ఓటు ఉన్న విషయం తెలియని దుస్థితి. ఇష్టారాజ్యంగా జాబితాలు రూపొందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. cm jagan: జగన్‌ మామ.. ఘాటు ప్రేమ

నా ఎస్సీ... నా ఎస్టీ... దాదాపుగా ప్రతీ సభలోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే పలికే మాట ఇది. పెదవుల్లోంచి వచ్చే పైపై మాటల ద్వారానే ఘాటు ప్రేమ చూపించడంలో ఆరితేరిపోయిన సీఎం జగన్‌... చేతల్లో వారి భవిష్యత్తుకు సమాధి కడుతున్నారన్నది నిష్ఠుర సత్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బంగారం ధర తగ్గినా.. కనిపించని మక్కువ..

అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో గత పది రోజులుగా బంగారం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు నెలలుగా 24 క్యారెట్లు పది గ్రాములు బంగారం ధర రూ.63,500 వరకు ఎగబాకింది. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.60,300కు దిగివచ్చింది. ధరలు తగ్గినా అమ్మకాలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని బులియన్‌ మార్కెట్‌ కళ తప్పుతోంది. ఆర్థిక మాంద్యం, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, ఉత్పత్తి పెరగడం తదితర కారణాలతో బంగారంపై పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ మాత్రమే ఎక్కువగా సాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని