logo

Gas Booking: గ్యాస్‌ కావాలా.. వాట్సాప్‌ చేస్తే చాలు

కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ కోసం లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారా..? ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారా..? ఇక ఆ ప్రయాస అవసరం లేదు.

Updated : 28 Jun 2023 07:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ కోసం లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారా..? ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారా..? ఇక ఆ ప్రయాస అవసరం లేదు. వాట్సాప్‌లో ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే చాలు కొత్త కనెక్షన్‌ సులభంగా పొందొచ్చు. వినియోగదారుల కోసం వాట్సాప్‌ సేవలు తీసుకొచ్చినా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో 42లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. యూపీఐ డిజిటల్‌ వ్యాలెట్‌ 15 శాతం, ఫోన్‌కాల్స్‌ ద్వారా 75 శాతం, వెబ్‌సైట్‌ తదితర పద్ధతులను 10శాతం మంది వినియోగించుకుంటున్నారు. ఆయిల్‌ కంపెనీల వాట్సాప్‌ నంబర్లతో సైతం వినియోగదారులు క్షణాల్లో బుకింగ్‌, రీఫిల్లింగ్‌, ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు మీరు హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులైతే.. ఆ సంస్థ వాట్సాప్‌ నంబరు 92222 01122లో Hi అని టైప్‌చేసి పంపగానే వచ్చే మెనూ ఆధారంగా అన్నిరకాల సేవలు పొందొచ్చు. ‘సువిధ’ ఎంపికలో కొత్త కనెక్షన్‌, కనెక్షన్‌ తొలగింపు తదితర సేవలను పొందొచ్చు.

* హెచ్‌పీ కంపెనీ సేవలకు 92222 01122

* ఇండేన్‌ కంపెనీ సేవలకు 75888 88824

* భారత్‌ గ్యాస్‌కు 18002 24344

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు