Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 May 2023 16:58 IST

1. కేసీఆర్‌కు రామగుండం వచ్చే తీరిక లేదు.. కానీ నాందేడ్‌ వెళ్తున్నారు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని.. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత భారాస ప్రభుత్వంపై ఉందని చెప్పారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పంటల బీమాను అమలు చేస్తున్నాయని.. తెలంగాణ కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ బకాయిలు ఎలా చెల్లిస్తుందో ప్రభుత్వం చెప్పాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి కాబట్టే ప్రభుత్వం ముందుకు వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. డీఏ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం లిఖితపూర్వకంగా స్పష్టం చేసేంతవరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు. ఏపీ పీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఈనెల 24న నిర్వహించనున్న 27వ మహాసభ కార్యక్రమ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సరికొత్త పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్‌గాంధీ

దేశరాజధానిలో సరికొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవనం(new Parliament building) ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ఆదివారం దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ సరికొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని(PM Modi)తో కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేజ్రీవాల్‌తో నీతీశ్‌ భేటీ.. కేంద్రంపై ‘రాజ్యసభ ప్లాన్‌’!

వచ్చే లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) నాటికి భాజపా (BJP)కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై (Opposition Unity) ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) ఆదివారం దిల్లీ (Delhi) సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తో భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు.. ఓడితే.. కష్టమే!

గత యాభై రోజులుగా అలరిస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 (IPL 2023) సీజన్‌ లీగ్‌ దశ చివరి రోజుకు చేరింది. నేడు మూడు జట్ల ప్లేఆఫ్స్‌ భవితవ్యం తేలనుంది. ఖాళీగా ఉన్న ఏకైక బెర్తు కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో బెంగళూరు, ముంబయి జట్లు ముందంజలో ఉండగా.. వీటి ఫలితాలపైనే రాజస్థాన్‌ అవకాశం ఆధారపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. రూ.2000 నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన పని లేదు: SBI

రూ.2,000 నోట్ల (Rs.2000 Notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ (RBI) ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నోట్లను మార్చుకునే సమయంలో ఫారం నింపాల్సి ఉంటుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదైనా గుర్తింపు ధ్రవపత్రాన్ని కూడా సమర్పించాలని కొందరు అంటున్నారు. అయితే, వీటిపై తాజాగా బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ స్పష్టతనిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. జీతం పెరగకపోయినా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.. ఉద్యోగులకు Microsoft CMO సూచన!

ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఇటీవల ప్రకటించింది. దీనిపై కంపెనీ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. కొంత మంది బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే, కంపెనీ వేతనం పెంచకపోయినా.. ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సీఎంఓ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాన్నా.. ప్రేరణ రూపంలో నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు: రాహుల్‌ గాంధీ

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్‌ (Congress) నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi ) ట్విటర్‌ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. ‘‘నాన్నా.. ఒక ప్రేరణ రూపంలో, జ్ఞాపకాలుగా మీరు సదా నాతోనే ఉన్నారు’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు రాజీవ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ వీడియోను కూడా ఆయన జత చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బఖ్‌ముత్‌ మొత్తం నాశనమైంది.. అక్కడేం మిగల్లేదు!

ఏడాదికిపైగా సాగుతోన్న రష్యా దురాక్రమణను (Russia Invasion) ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. శక్తిమంతమైన ఆయుధాలతో మాస్కో దాడులకు తెగబడుతున్నప్పటికీ.. ప్రతిదాడులతో తమ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రాంతమైన బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలాంటి ప్లేయర్లను ‘వేలం’లోనే ఎంచుకుంటాం: ధోనీ

ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) పన్నెండోసారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) చివరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను సీఎస్‌కే 77 పరుగుల తేడాతో చిత్తు చేసి మరీ ఘనంగా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. టాప్‌ -2లో ఉండటంతో తొలి క్వాలిఫయర్‌లో మే 23న చెపాక్‌ వేదికగానే గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని