Bopparaju: ఆ బకాయిలు ఎలా చెల్లిస్తుందో ప్రభుత్వం చెప్పాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి కాబట్టే ప్రభుత్వం ముందుకు వస్తోందని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Updated : 21 May 2023 14:32 IST

విజయవాడ: ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి కాబట్టే ప్రభుత్వం ముందుకు వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. డీఏ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం లిఖితపూర్వకంగా స్పష్టం చేసేంతవరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు. ఏపీ పీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఈనెల 24న నిర్వహించనున్న 27వ మహాసభ కార్యక్రమ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. 

‘‘పీఆర్‌సీ బకాయిలు, నాలుగు డీఏ బకాయిలు ఎలా చెల్లిస్తుందో ప్రభుత్వం చెప్పాలి. మిగతా డిమాండ్లపై కూడా చర్చ జరగాలి..పరిష్కరించాలి. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం కొనసాగుతోంది. నాలుగోదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 27న ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సుకు ఉద్యోగులు తరలిరావాలి. ఉద్యమం చేస్తుంటేనే సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోంది ’’ అని బొప్పరాజు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని