Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Apr 2024 09:12 IST

1. ప్రజారోగ్యానికి పట్టిన వైరస్‌.. జగన్‌

వట్టిగొడ్డుకు అరుపులెక్కువ.. వానలేని మబ్బుకు ఉరుములెక్కువ.. ఒక సీఎంగా జనంకోసం చేయాల్సినవి చేయని జగన్‌కు ప్రగల్భాలెక్కువ! సిగ్గూశరం అనేవాటికి నీళ్లొదిలేసి ‘‘ప్రభుత్వాసుపత్రులు మారాయంటే కారణం మీ జగన్‌’’ అంటూ ఆయన ఇటీవలే సొంతడబ్బా కొట్టుకున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ఏలుబడిలో సర్కారీ దవాఖానాలు ఎంతలా మారిపోయాయో చూడాలంటే-  సీఎం దొరగారి స్వస్థలానికి వెళ్తే సరిపోతుంది. పూర్తి కథనం

2. ఖమ్మంపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినా మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మిగిలిన రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారంలో ముందుండగా.. కాంగ్రెస్‌ మాత్రం మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఖమ్మం అభ్యర్థిత్వం తేలకపోవడంతో కరీంనగర్‌, హైదరాబాద్‌లనూ పెండింగ్‌లో పెట్టింది. పూర్తి కథనం

3. దళితులంటే జగన్‌కు చులకన

సీఎం జగన్‌కు దళితులంటే చులకన అని.. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్‌రావులను సైతం చిన్నచూపు చూశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపాలోని దళిత ప్రజాప్రతినిధులపైనా పెత్తందారీతనమే రాజ్యమేలిందని మండిపడ్డారు. జగన్‌ అయిదేళ్ల పాలనలో దళితులపై ఆరు వేల కేసులు నమోదయ్యాయి.పూర్తి కథనం

4. కాంగ్రెస్‌లోకా.. అబ్బే!

కాంగ్రెస్‌లో చేరబోతున్నానంటూ ప్రకటించి 24 గంటలు గడవకముందే రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ యూటర్న్‌ తీసుకున్నారు. అబ్బే... కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ శనివారం అధికారికంగా ప్రకటించారు. పార్టీలో ప్రముఖ స్థానాన్ని కల్పిస్తామని.. నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పాలని భారాస అగ్రనేతలు కోరినట్లు సమాచారం.పూర్తి కథనం

5. ఆంధ్రాకు అప్పులే శాపం

‘ఏపీలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. భారీగా చేసిన అప్పులు భవిష్యత్తులో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రాబోయేతరాలు ఈ రుణ భారాన్ని మోయాల్సి ఉంటుంది’ అని ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ మహేంద్రదేవ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం మధ్య సమతుల్యం లోపించిందని అన్నారు.పూర్తి కథనం

6. నిన్నుమించిన ఘనులు.. నీతిమాలిన పనులు!

ఇందు కలదు.. అందు లేదనే సందేహం వలదు.. ఏ నియోజకవర్గంలో చూసినా మట్టి అక్రమార్కులే. నాకేం తక్కువ.. నేనెందుకు తినకూడదని ఒకరిని మించి ఒకరు మట్టిని బొక్కారు. మట్టి దాహంతో వీరు... జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణ గుత్త సంస్థలతో బేరాలాడి.. బెదిరించి మరీ సరఫరా చేశారు.పూర్తి కథనం

7. కడుపులోనే కరిగించేస్తున్నారు..!

అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఆడపిల్లలను బాధ్యతగా చూసుకోవాల్సిన వారు బరువుగా భావిస్తున్నారు. గర్భం దాల్చిన కొద్ది రోజులకే పుట్టబోయేది ఆడా.. మగా అని తెలుసుకుని కడుపులోనే కరిగించేస్తున్నారు. చేసేది తప్పని.. అమ్మాయి పుడితే కలిగే ప్రయోజనాలపై చైతన్యం చేయాల్సిన వైద్యులే డబ్బులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ చేసి గర్భంలోనే కడతేరుస్తుండడం అత్యంత హేయం..పూర్తి కథనం

8. ఇళ్లన్నారు.. కన్నీళ్లు మిగిల్చారు..

కాలనీలోకి వెళ్లాలంటే దారీతెన్నూ కనపడదు.. గుక్కెడు నీటి కోసం గొంతెండి పోవాల్సిందే.. వీధి దీపాలు పూర్తిస్థాయిలో లేక రాత్రయితే అంధకారం.. సరైన కాలువల వ్యవస్థ లేక వీధులను వీడని దుర్గంధం.. ఇదీ జగనన్న కాలనీల్లో పరిస్థితి.పూర్తి కథనం

9. ఫోన్‌ పోయిందా.. మీరే బ్లాక్‌ చేయొచ్చు

ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్‌ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకువచ్చి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. మోసగాళ్లు లింక్‌ల ద్వారా మాల్‌వేర్లు పంపించడం.. బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్‌ చేయడం.. ఓటీపీలు తెలుసుకోవడం.. లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ మూలం సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులే. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.పూర్తి కథనం

10. భూ యజమానులకు తెలియకుండానే చేతులు మారిపోతున్నాయ్‌!

2020 అక్టోబరు 29వ తేదీకి ముందు ఆర్వోఆర్‌ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన భూమి దస్తావేజులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసేవారు. అనంతరం ఆ దస్త్రాన్ని రెవెన్యూ శాఖకు పంపితే తహసీల్దార్‌ కార్యాలయం పది రోజుల్లోపు మ్యుటేషన్‌ (రెవెన్యూ దస్త్రాల్లో యాజమాన్య హక్కుల మార్పిడి) ప్రక్రియను ఉచితంగా చేపట్టేది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని