Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...   

Published : 25 May 2024 21:00 IST

1. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్‌.. అధికారులతో సమీక్ష

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సెక్యూరిటీ వింగ్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ వింగ్‌లను సీఎం పరిశీలించారు.  పూర్తి కథనం

2. ఆరో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్‌!

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ఆరో దశ పోలింగ్‌ సమయం ముగిసింది. ఈ విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల సంఘం (Election Commission) గణాంకాల ప్రకారం.. సాయంత్రం ఐదు గంటలకు దాదాపు 57.70 శాతం పోలింగ్‌ నమోదైంది. పూర్తి కథనం

3. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు.. రఫాపై ఇజ్రాయెల్‌ ముమ్మర దాడులు

అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) మొట్టికాయలు వేసినప్పటికీ ఇజ్రాయెల్‌ (Israel) తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దక్షిణ గాజాలోని రఫాపై (Rafah) సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలన్న ఐసీజే ఆదేశాలను ఇజ్రాయెల్‌ బేఖాతరు చేసింది. శనివారం కూడా రఫా నగరంపై తుపాకులతో విరుచుకుపడింది. పూర్తి కథనం

4. బెంగాల్లో భాజపా అభ్యర్థిపై దాడి...తృణమూల్ పనేనన్న కేంద్రం

స్థానిక భాజపా నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్‌ (Jhargram)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న ఝర్‌గ్రామ్‌ నియోజకవర్గానికి చెందిన భాజపా అభ్యర్థి ప్రణత్ టుడు(Pranat Tudu),  ఆయన అనుచరులతో పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లారు. పూర్తి కథనం

5. ప్రధానిగా ఆ విషయం మరిచారా? మోదీ ‘ముజ్రా’ వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బిహార్‌ ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi).. విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) తన దాస్యాన్ని చాటుతూ.. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారిముందు ముజ్రా (పురుషులను ఆకట్టుకునేందుకు మహిళలు చేసే ఓ రకమైన నృత్యం) చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. పూర్తి కథనం

6. పిన్నెల్లికి సలాం కొట్టిన పోలీసులే.. బాదటానికి రెడీ..: వర్ల రామయ్య

పోలింగ్‌ సరళి చూశాక ఓడిపోతున్నట్లు వైకాపా నేతలకు అర్థమైపోయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అందుకే వెబ్‌కాస్టింగ్‌ బటన్‌ చంద్రబాబు చేతిలో ఉందని సాక్షిలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు.  పూర్తి కథనం

7. కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు

మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్టు తేలడంతో కామారెడ్డి జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  పూర్తి కథనం

8. ఉపరితల ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

రాజస్థాన్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో ఉత్తరదిశగా కదులుతున్నట్టు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. పూర్తి కథనం

9. కొకైన్‌ పార్శిల్‌ వచ్చిందని బెదిరించి.. రూ.14.73లక్షలు కాజేశారు

నగరానికి చెందిన ఓ మహిళ సైబర్‌ నేరగాళ్ల మోసానికి బలైంది. ఆమె పేరుతో పార్శిల్‌లో 5కిలోల దుస్తులు, 7 నకిలీ పాస్‌పోర్టులు, 5 ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు, 960 గ్రాముల కొకైన్‌ వచ్చిందని సైబర్‌ నేరగాళ్లు బెదిరించారు. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి మాట్లాడుతున్నామని.. బ్యాంకు ఖాతా వెరిఫై చేయాలని వివరాలన్నీ సేకరించారు. పూర్తి కథనం

10. రాళ్లు తినండి.. పిజ్జాపై గమ్‌ వేసుకోండి.. వివాదాస్పదమైన గూగుల్‌ ఏఐ సమాధానాలు

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ (Google) ఇటీవల అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని (Gemini AI)’ని అందుబాటులోకి తెచ్చింది. కచ్చితత్వంతో తక్షణ సమాధానాలు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఏఐ టూల్‌ అందించే జవాబులపై యూజర్ల నుంచి అసంతృప్తి ఎదురవుతోంది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు