Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 May 2024 20:59 IST

1.తెలంగాణ రాష్ట్ర గీతం భేష్‌.. కాంగ్రెస్, మిత్రపక్ష నేతల హర్షం

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్‌ 2న ‘జయ జయహే తెలంగాణ’  గేయం జాతికి అంకితం చేయనున్నట్టు  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు.  పూర్తి కథనం

2. జూన్‌ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటాం: జీఏడీ

జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. పూర్తి కథనం

3. ‘సత్యభామ’ చేసినందుకు గర్వంగా ఉంది: కాజల్ అగర్వాల్‌

కాజల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’ (Sathyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాన్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రబృందం ప్రెస్‌మీట్‌లో సినిమా విశేషాలు పంచుకుంది.  పూర్తి కథనం

4. టాప్‌ వికెట్‌ టేకర్ జస్‌ప్రీత్ బుమ్రా.. టాప్‌ స్కోరర్‌ ట్రావిస్ హెడ్‌: పాంటింగ్‌

జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఈసారి విజేత ఎవరు అనేది పక్కనపెడితే.. మొత్తం 20 జట్లు బరిలో నిలిచాయి. ఇందులో సగం జట్ల నుంచి ఏవైనా సంచలనాలు నమోదైతే టోర్నీ ఆసక్తికరంగా మారడం ఖాయం. పూర్తి కథనం

5. ఎయిర్‌టెల్‌, జియో బాటలో వీఐ.. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త రీఛార్జి ప్లాన్లు

యూజర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఓటీటీలపై ప్రజలు ఆసక్తి చూపుతున్న తరుణంలో తన రీఛార్జి ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సదుపాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. పూర్తి కథనం

6. ఒక్క ఐఫోన్‌ మార్కెట్లోకి తేవడానికి ఇన్ని ఫోన్లపై టెస్టులా?

ఐఫోన్‌ అంటే వెంటనే గుర్తుకొచ్చేది దాని ప్రీమియం లుక్‌, డిజైన్‌ మాత్రమే కాదు.. దాని డ్యూరబిలిటీ కూడా. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్లు దృఢంగా ఉంటాయి. నీటిలో పడినా.. చేతుల్లోంచి జారి ఎత్తు నుంచి కింద పడినా ఈ ఫోన్లు ఎంచక్కా పని చేస్తుంటాయి. చాలామంది ఐఫోన్లను ఇష్టపడేది ఇందుకే. పూర్తి కథనం

7.  డ్రాగన్‌ కవ్వింపు.. భారత సరిహద్దులో అధునాతన ఫైటర్‌ జెట్‌ల మోహరింపు

పొరుగుదేశం చైనా (China) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గతంలో భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపుతూ స్టాండర్డ్ మ్యాప్‌ను విడుదల చేసిన డ్రాగన్‌.. తాజాగా అధునాతన జే-20 ఫైటర్‌ జెట్లను (J-20 Fighter jets) సిక్కిం సమీపంలోని భారత్‌- చైనా (India-China) సరిహద్దుకు 150 కి.మీ. కంటే తక్కువ దూరంలో మోహరించింది.  పూర్తి కథనం

8. లోక్‌సభ తుది దశ పోరు.. ముగిసిన ప్రచారం గడువు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏడో దశ ఎన్నికల ప్రచార గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాలు జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. పూర్తి కథనం

9. ఒకే రోజున కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు రుతుపవనాలు.. అరుదైన సందర్భానికి కారణమిదే..!

మండు వేసవిలో చల్లని కబురును మోసుకొస్తూ నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలోకి ప్రవేశించాయి. గురువారం ఉదయం కేరళ (Kerala) తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం అధికారికంగా వెల్లడించింది. పూర్తి కథనం

10. కెనడా పర్యటన.. వారికి ‘పోలీస్‌ క్లియరెన్స్‌’పై ప్రభుత్వం క్లారిటీ

కెనడా వీసా నిబంధనల్లో ఇటీవల వచ్చిన మార్పుల నేపథ్యంలో.. అక్కడికి వెళ్లే విదేశీ పర్యటకులు సమర్పించాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించి ట్రూడో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాత్కాలిక పర్యటనకు వచ్చేవారికి ఆయా దేశాల నుంచి ‘పోలీస్‌ క్లియరెన్స్‌’ సర్టిఫికెట్‌ అవసరం లేదని తెలిపింది.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు