Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 02 May 2024 12:58 IST

1. ‘నవ సందేహాల’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ

‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు. ఉద్యోగాల విషయంలో ‘నవ సందేహాల’కు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘‘2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది? ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు? 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఏం చేశారు? పూర్తి కథనం

2. దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్‌లో 223 మంది తొలగింపు

దేశ రాజధానిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ  (AAP) ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ మహిళా కమిషన్‌ (Delhi Commission for Women)లో 223 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఎల్జీ (Delhi LG) కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కథనం

3. జగన్‌ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి

సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌ ప్రచారంపై ఈసీ తక్షణం నిషేధం విధించాలి. అబద్ధాలతో విపక్షాలపై ఆయన బురద చల్లుతున్నారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం

4. వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్‌

అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడడంలో విదేశాల నుంచి వస్తున్న వలసదారులది ముఖ్య పాత్ర అని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) అన్నారు. వలసవిధానాన్ని ప్రోత్సహించని దేశాల్లో వృద్ధి నెమ్మదిగా సాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.పూర్తి కథనం

5. ఐదేళ్లలో జగన్‌ అవినీతి రూ.8 లక్షల కోట్లు: తెదేపా నేత పట్టాభిరామ్‌

ఐదేళ్లలో వైఎస్‌ జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో భాజపా, జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు.పూర్తి కథనం

6. గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ (Goldy Brar) అమెరికా(USA)లోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. పూర్తి కథనం

7. లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ (Congress) పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దీన్ని ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తామనేదాన్ని ఆయన వెల్లడించనున్నారు.పూర్తి కథనం

8. బ్రిజ్‌ భూషణ్‌కు టికెట్‌ కట్‌..!

వివాదాస్పద భాజపా నేత, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan)కు ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కట్‌ చేసినట్లు తెలుస్తోంది. కైసర్‌గంజ్‌ నుంచి అతడు ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలే ఓ ఆంగ్ల వార్తా ఛానెల్‌కు వెల్లడించాయి.పూర్తి కథనం

9. ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!

కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా ఎండలు కుమ్మేస్తున్నాయి. అయినా వేడిని సైతం లెక్కచేయకుండా పార్టీలు బ్యాలెట్‌ పోరు (2024 India elections)లో మునిగిపోయాయి. ఈసారి ఎండలే కాదు.. ఎన్నికల ఖర్చూ తీవ్రంగానే ఉండనుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్వయంగా దేశ ఆర్థికమంత్రే ‘నా దగ్గర అంత సొమ్ము లేదు’ అందుకే లోక్‌సభకు పోటీ చేయనని చేతులెత్తేశారంటే ఖర్చును అర్థం చేసుకోవచ్చు.పూర్తి కథనం

10. ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్‌

చెన్నై జట్టుకు తన సొంతమైదానం చెపాక్‌లో మళ్లీ ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్‌ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ ఈ పరాజయం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై (162/7) భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (62) కీలక ఇన్నింగ్స్‌ ఆడినా సరిపోలేదు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని