icon icon icon
icon icon icon

Pattabhi: ఐదేళ్లలో జగన్‌ అవినీతి రూ.8 లక్షల కోట్లు: తెదేపా నేత పట్టాభిరామ్‌

ఐదేళ్లలో వైఎస్‌ జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 02 May 2024 12:00 IST

అమరావతి: ఐదేళ్లలో వైఎస్‌ జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో భాజపా, జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. కూటమి మ్యానిఫెస్టోలోని ప్రతి పథకాన్నీ అమలు చేస్తామన్నారు. 

చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్‌ ముఠా సిద్ధహస్తులు: లంకా దినకర్‌

భాజపా మ్యానిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను.. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయని భాజపా నేత లంకా దినకర్‌ అన్నారు. ‘‘భాజపా జాతీయ శక్తి.. తెదేపా-జనసేన ప్రాంతీయ శక్తి. రెండు శక్తుల కలయిక.. దేశ, రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి. మోదీ గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. పవన్‌ పాపులారిటీ.. ఎన్డీయే విక్టరీ. వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఆంధ్రా మా స్ఫూర్తి. దేశం, రాష్ట్రం రెండు కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. తెదేపా-జనసేన మ్యానిఫెస్టో విడుదలకు భాజపా నేతలు హాజరయ్యారు. చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్‌ ముఠా సిద్ధహస్తులు. శ్మశానంలో శిలాఫలకాపై కూడా బొమ్మలు వేసుకోవాలనే మానసిక స్థితికి సీఎం దిగజారిపోయారు’’ అని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img