Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Apr 2024 13:13 IST

1. ప్రశ్నించిన వారిని తన్నేందుకా ‘సిద్ధం’: నారా లోకేశ్‌

వైకాపా నేతలు ‘సిద్ధం’ అంటే ఏంటో అనుకున్నానని.. ప్రశ్నించిన వారిని తన్నేందుకా? అని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రాజధాని ఎక్కడని ప్రశ్నించిన వారిపై ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైకాపా సైకోలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

2. మోదీకి సరైన పోటీ ఎవరు..? శశిథరూర్‌ ఆసక్తికర సమాధానం

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor). తాజాగా ఆయనకు విలేకరుల నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)కి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ జర్నలిస్టులు ఆయన్ను అడిగారు.పూర్తి కథనం

3. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి లేదు: కేటీఆర్‌

మిషన్‌ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని చెప్పారు. నేడు ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందన్నారు. మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వినియోగంలోకి వచ్చాయని ఎద్దేవా చేశారు. పూర్తి కథనం

4. ఆతిశీజీ.. మా దగ్గర ఖాళీల్లేవ్‌: కేంద్రమంత్రి కౌంటర్‌

నెలరోజుల వ్యవధిలో భాజపాలో చేరాలని.. లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా భాజపా తనను సంప్రదించిందని దిల్లీ మంత్రి, ఆప్‌ నాయకురాలు ఆతిశీ (Atishi) సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ పురి (Hardeep Singh Puri) కౌంటర్ ఇచ్చారు.పూర్తి కథనం

5. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల రుణం తీసుకోవాలన్నారని తెలిపారు. రేవంత్‌ మాటలు నమ్మి లక్షల మంది అప్పులు తీసుకున్నారన్నారు.పూర్తి కథనం

6. తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు.. హైఅలర్ట్‌లో గార్డ్స్‌..!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు తిహాడ్‌ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. అదే కారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్‌ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహాడ్‌లోని జైల్‌ నంబర్‌-2లో కేజ్రీవాల్‌ ఉన్నారు.పూర్తి కథనం

7. మాది ఘోర తప్పిదం.. అంగీకరించిన ఇజ్రాయెల్‌.. అగ్రరాజ్యం ఆగ్రహం!

హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ (Israel) జరుపుతున్న యుద్ధంపై ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు పెదవి విరుస్తున్నాయి. వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని పిలుపునిస్తున్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో.. మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించడంతో వివాదం ముదిరింది.పూర్తి కథనం

8. కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14వేల నుంచే IRCTC ప్యాకేజీలు

వేసవి సెలవులు వచ్చాయంటే వెంటనే గుర్తుకొచ్చేది విహారం. చాలామంది తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్‌ చేస్తుంటారు. ఒకవేళ మండు వేసవిలో ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకుంటూ ఉంటే.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అందిస్తున్న కేరళ టూరిజం ప్యాకేజీని పరిశీలించండి.పూర్తి కథనం

9. మయాంక్‌ యాదవ్‌కు బౌలింగ్‌ కాంట్రాక్ట్ ఇవ్వాలి: విండీస్‌ క్రికెట్ దిగ్గజం

వరుసగా రెండు మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులను మయాంక్‌ యాదవ్ దక్కించుకున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా అవతరించిన ఈ లఖ్‌నవూ యువ పేసర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడికి బీసీసీఐ బౌలింగ్‌ కాంట్రాక్ట్‌ను ఇవ్వాలని వెస్టిండీస్‌ క్రికెట్ దిగ్గజం ఇయాన్‌ బిషప్ సూచించాడు. పూర్తి కథనం

10.ఫోన్‌ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్‌ సీబీఐ దర్యాప్తు కోరాలి: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని