Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Mar 2024 14:42 IST

1. తెదేపా మూడో జాబితా విడుదల

 తెదేపా (TDP) అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే  128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది. పూర్తి కథనం 

2. 21వ శతాబ్దపు ‘పుష్పక’ విమానం.. పునర్వినియోగ రాకెట్‌ కీలక ప్రయోగం సక్సెస్‌

అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇస్రో (ISRO) తయారు చేసిన ‘రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌’ అటానమస్‌ ల్యాండింగ్‌ ప్రయోగాన్ని (RLV LEX-02) విజయవంతంగా చేపట్టింది. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌) దీనికి వేదికైంది.పూర్తి కథనం 

3. విశాఖలో డ్రగ్స్‌.. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది: సాధినేని యామిని

విశాఖలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామినీశర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్‌ విభాగం డ్రగ్స్‌ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.పూర్తి కథనం 

4. భూటాన్‌ పర్యటనకు ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) భూటాన్‌ పర్యటనకు ఈ ఉదయం బయల్దేరి వెళ్లారు. వాస్తవానికి నిన్ననే ఆయన పర్యటన ప్రారంభం కావాల్సింది. అనివార్యకారణాలతో ఒక రోజు జాప్యం చోటు చేసుకొంది. తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్‌ గ్యాల్పో’ను ఆయనకు అందజేయనున్నారు.పూర్తి కథనం 

5. జనసేన నేతల వాహనంపై రాళ్లదాడి

పల్నాడు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో జనసేన నాయకులపై దాడి జరిగింది. మాచర్ల నుంచి స్వగ్రామం మించాలపాడుకు వెళ్తున్న వారి వాహనాన్ని జంగమహేశ్వరపాడుకు చెందిన వైకాపా నేతలు వెంబడించి రాళ్లతో దాడికి పాల్పడ్డారు.పూర్తి కథనం 

6. హైదరాబాద్‌ శివారులో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

నగర శివారు ఐడీఏ బొల్లారంలో భారీగా మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ తయారుచేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించి 90 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి కథనం 

7. బెయిల్‌ ఇవ్వలేం.. ట్రయల్‌ కోర్టుకు వెళ్లండి: కవితకు సుప్రీం సూచన

మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది.పూర్తి కథనం 

8. రహస్యంగా వివాహం చేసుకున్న జొమాటో సీఈఓ..!

ప్రముఖ ఆహార డెలివరీ యాప్‌ జొమాటో(Zomato) సీఈఓ దీపిందర్ గోయల్‌ (Deepinder Goyal) రెండో పెళ్లి చేసుకున్నారు. మోడల్‌ గ్రేసియా మునోజ్‌ను వివాహం చేసుకున్నారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. నెల క్రితమే ఈ పెళ్లి జరగ్గా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పూర్తి కథనం 

9. రుతురాజ్‌కు సీఎస్కే కెప్టెన్సీ.. ఇది సడెన్‌ నిర్ణయం కాదు: అశ్విన్

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఏం చేసినా అందర్నీ ఆశ్యర్యానికి గురి చేస్తాడు. నాలుగేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అంతకుముందు టీమ్‌ఇండియా కెప్టెన్సీని వదిలేయడమైనా సరే సడెన్‌గా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టు పగ్గాలను యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)కు అప్పగించాడు.పూర్తి కథనం 

10. కస్టడీలో కేజ్రీవాల్ భద్రత సంగతేంటి..? ఆప్‌ ఆందోళన

తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భద్రతపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని.. ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం తగిన రక్షణ కల్పిస్తుందా..?అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆప్‌ మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు