Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Mar 2024 13:12 IST

1. కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి డబ్బులు పంపారని ఇటీవల కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. రూ.2,500 కోట్లు వసూలుచేసి అధిష్ఠానానికి పంపారని ఆయన పేర్కొన్నారు. పూర్తి కథనం

2. మద్యం కేసులో.. మరో ఆప్‌ మంత్రికి ఈడీ సమన్లు

దేశ రాజధానిలో మద్యం విధానానికి (Delhi Excise Policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకోగా.. తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి.పూర్తి కథనం

3. పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు

దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న (Bharat Ratna)’ ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు (PV Narasimha Rao) తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.పూర్తి కథనం

4. కాలేజీ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు..

కాలేజీకెళ్లి చదువుకునే విద్యార్థి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఆదాయపు పన్ను అధికారులు అతడికి పన్ను నోటీసులు (Tax Notice) పంపారు. కంగుతిన్న ఆ విద్యార్థి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో వెలుగు చూసిందీ ఘటన.పూర్తి కథనం

5. కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి

లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు గట్టి షాక్‌. జీహెచ్‌ఎంసీ మేయర్‌ జి.విజయలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి కథనం

6. ఇసుక రీచ్‌ వద్ద దాడి.. ఇరువర్గాలపై కేసు నమోదు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో ఇసుక రీచ్‌లో దాడికి పాల్పడిన ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఎస్సై ఆర్‌.రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి మున్నంగి వాగులో ఇసుక  తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని నిరసన వ్యక్తం చేసిన వారిపై వైకాపా నేతలు, ఇసుక మాఫియా సాగిస్తున్న పలువురు దాడి చేశారు.పూర్తి కథనం

7. ‘నేను విమానం డోర్‌ పక్కన కూర్చోనుగా’: బోయింగ్‌ ఘటనలపై బైడెన్‌ చమత్కారం

తన బోయింగ్ (Boeing) విమానం ఎయిర్‌ ఫోర్స్ వన్ తలుపు వద్ద తాను కూర్చోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. ఇటీవల బోయింగ్ సంస్థకు చెందిన విమానాల్లో వెలుగుచూస్తోన్న ఘటనలను ఉద్దేశించి ఈ విధంగా చమత్కరించారు. ఒక టాక్‌షో వ్యాఖ్యాత బైడెన్‌ (Biden)తో మాట్లాడుతూ.. ‘‘మీరు న్యూయార్క్‌ సిటీకి బయల్దేరేముందు మీ రవాణాశాఖ మంత్రి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ బోల్టులు బిగించారా..?’’ అంటూ ప్రశ్నించారు.పూర్తి కథనం

8. బెంచ్‌పై ఉంచితే పరుగులు చేస్తాడా..? పృథ్వీషాకు అవకాశాలు ఇవ్వాలి

భారత యువ ఆటగాడు పృథ్వీ షాకు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో పెద్దగా రాణించనంత మాత్రాన ఆడించకపోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. మినీ వేలం సమయంలో దిల్లీ జట్టు పృథ్వీ షాను వదిలేయకుండా అట్టిపెట్టుకుంది. ఈ సీజన్‌లో ఇంకా ఆడించలేదు.పూర్తి కథనం

9. స్టార్క్‌ అదరగొట్టేస్తాడు.. కాకపోతే కాస్త సమయం అవసరం: స్టువర్ట్‌ బ్రాడ్

ఐపీఎల్ మినీ వేలంలో దాదాపు రూ. పాతిక కోట్లు సొంతం చేసుకున్నాడు మిచెల్‌ స్టార్క్‌. కానీ, రెండు మ్యాచుల్లోనూ ఒక్క వికెట్టూ తీయలేదు సరికదా 100 పరుగులు సమర్పించాడు. దీంతో అతడి ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. కోల్‌కతా రెండు మ్యాచుల్లోనూ గెలవడంతో ఇప్పటికిప్పుడు అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు.పూర్తి కథనం

10. జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై కొబ్బరి బొండాల వ్యాపారి దాడి

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో ఓ కొబ్బరిబొండాల వ్యాపారి జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కొబ్బరి బొండాలు పెట్టొద్దని వ్యాపారికి సూచించారు. అయినా వారు వినకపోవడంతో కొబ్బరిబొండాలను జీహెచ్‌ఎంసీ వాహనంలో వేసేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి, అతని అనుచరులు మున్సిపల్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్ల దాడికి తెగబడ్డారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు