Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Mar 2024 13:04 IST

1. సీఎం జగన్‌ మహానటుడు: నారా లోకేశ్‌

తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో ఆయన సమావేశమై మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో తొమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. పూర్తి కథనం

2. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవల కడియం కావ్యకు భారాస వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది.  పూర్తి కథనం

3. రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల సంఘంపై వైకాపా దుష్ప్రచారం: అనగాని సత్యప్రసాద్‌

రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల సంఘంపై వైకాపా దుష్ప్రచారానికి దిగుతోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను పంపిణీ చేయొద్దనే ఈసీ చెప్పిందని.. పథకాలు ఆపమని కాదన్నారు. వాళ్లు లేకుండా గతంలో పింఛన్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. పూర్తి కథనం

4. క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరిన భారాస అధినేత కేసీఆర్‌

భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్‌ తండాకు చేరుకుని పంటలను పరిశీలించనున్నారు.పూర్తి కథనం

5. తెదేపాలో చేరాడని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. ఆరు నెలల క్రితం వైకాపా నుంచి తెదేపాలో చేరానని.. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తనపై కక్షగట్టారని బాధితుడు ఆరోపించాడు. వివరాల్లోకి వెళితే.. మందస మండలం గౌడు గురంటికి చెందిన గాడి దేవరాజు ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ కింద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పూర్తి కథనం

6. ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్‌.. రూ.36,000 ఫైన్‌, అరెస్ట్‌

సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం కొంత మంది చేస్తున్న హడావుడి శృతి మించుతోంది. ఒక్కోసారి అవి వారి ప్రాణాల మీదకూ తెస్తున్నాయి. మరికొన్నిసార్లు సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా దిల్లీలో ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి పోలీసులే బాధితులుగా మారాల్సిన దుస్థితి. పూర్తి కథనం

7. అమెరికాలో వంతెనను ఢీకొన్న బార్జ్‌..!

అమెరికా(USA)లో బాల్టిమోర్‌ వంతెన ప్రమాదాన్ని ప్రజలు మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఓక్లహోమా(Oklahoma)లోని ఆర్కన్సాస్‌ నదిపై వంతెనను బార్జ్‌ (భారీ వాహనాలను తరలించే పంటు వంటిది) ఢీకొంది. పూర్తి కథనం

8. రోహన్‌ బోపన్న జోడీ మరో రికార్డు.. మియామి ఓపెన్‌ విజేత

భారత టెన్నిస్ స్టార్‌ రోహన్ బోపన్న (Rohan Boppanna) వయసు పెరిగే కొద్దీ విజయాలబాటలో పరుగులు పెడుతున్నాడు. తాజాగా డబుల్స్‌ విభాగంలో మియామి ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. తన సహచరుడు మ్యాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డొడిక్ - అమెరికన్ ప్లేయర్ ఆస్టిన్ క్రాజిసెక్‌పై 6-7, 6-3, 10-16 తేడాతో విజయం సాధించారు. పూర్తి కథనం

9. ఆప్‌ కీలక నేత రాఘవ్‌ చద్దా ఎక్కడా..?

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వంటి పరిణామాలు చోటు చేసుకొన్న సమయంలో ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన రాఘవ్‌ చద్దా (Raghav Chadha) కనిపించలేదు. ఈ విషయాన్ని ఎన్‌సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ప్రతిపక్ష ఉపనేత జితేంద్ర అవ్హద్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో సభ్యులు కావడం గమనార్హం. పూర్తి కథనం

10. అది ‘పరివార్‌ బచావో’ ర్యాలీ.. ఇండియా కూటమి సభపై భాజపా

దేశ రాజధాని దిల్లీలో ‘లోక్‌తంత్ర బచావో ర్యాలీ’ పేరిట విపక్ష ‘ఇండియా కూటమి’ నిర్వహిస్తున్న ర్యాలీపై అధికార భాజపా (BJP) విరుచుకుపడింది. అది ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ కాదని.. ‘కుటుంబాన్ని రక్షించండి.. అవినీతిని కప్పిపుచ్చండి’ అనే కార్యక్రమమని ఎద్దేవా చేసింది. తమ పాత నేరాలన్నింటినీ కప్పిపుచ్చుకనే పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని భాజపా ఎంపీ సుధాంశు త్రివేది ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని