Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Feb 2024 13:06 IST

1. TDP-Janasena: తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలుగుదేశం (TDP), జనసేన పార్టీ (Jana sena)ల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా (TDP and Janasena first list) విడుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే తెదేపా అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. పూర్తి కథనం

2. Air India: విమానంలో భద్రతకు ‘క్లాసికల్‌’ టచ్‌.. ఎయిరిండియా ఐడియా అదుర్స్‌

విమాన ప్రయాణాల్లో భద్రతా సూచనలు పాటించాలంటూ ఎయిర్‌ హోస్ట్‌, మైక్‌ల ద్వారా ప్రయాణికులకు ఆయా సంస్థలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా ఓ విన్నూత ఆలోచన చేసింది. తమ ప్రయాణికుల రక్షణ నిమిత్తం ఈ భద్రతకు క్లాసికల్‌ టచ్‌ ఇచ్చింది. భారత్‌లో ప్రముఖ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, బిహు, కథాకళి, కథక్‌, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్‌లను సమ్మిళితం చేసి ఒక వీడియోను రూపొందించింది. పూర్తి కథనం

3. Team India: కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు.. అరంగేట్రంలో సత్తా చాటుతున్న క్రికెటర్లు

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌. వ్యక్తిగత కారణాలతో కోహ్లి సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో కేఎల్‌ రాహుల్‌ మూడు టెస్టుల్లో ఆడలేదు. శ్రేయస్‌ కూడా దూరమయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో అనుభవలేమి. కానీ సిరీస్‌లో 2-1తో భారత్‌దే ఆధిక్యం. ఇక అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ప్రధాన పేసర్‌ బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతినిచ్చారు. పూర్తి కథనం

4. MP Raghurama: వైకాపాకు ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వైకాపా ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. వెంటనే ఆమోదించాలని కోరుతున్నా. పూర్తి కథనం

5. Flight: 5 గంటలు విమానంలోనే.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ మారిషస్‌ (Air Mauritius)కు చెందిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువురు చిన్నారులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. పూర్తి కథనం

6. ఘోర ప్రమాదం.. చెరువులో పడిన యాత్రికుల ట్రాక్టర్‌.. 15 మంది మృతి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ యాత్రికులంతా హరిద్వార్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పూర్తి కథనం

7. Instant Loan: ఇన్‌స్టంట్‌ రుణమా..? ఈ విషయాలు తెలుసుకున్నాకే..!

రుణం తీసుకోవాలంటే ఒకప్పుడు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. డిజిటల్‌ యుగంలో ఆ బాధ తప్పింది. రుణం తీసుకోవడం సులువైపోయింది. అనుకున్నదే తడవుగా ఇప్పుడు లోన్‌ లభిస్తోంది. సింగిల్‌ క్లిక్‌తో ఎటువంటి డాక్యుమెంట్లూ తీసుకోకుండానే పని పూర్తయిపోతోంది. సులువుగా ఇన్‌స్టంట్‌ రుణాలు లభిస్తుండడంతో ఈ తరహా లోన్లకు ఆదరణ పెరుగుతోంది. ఒకవేళ మీరూ ఈ తరహా రుణాలు తీసుకోవాలనుకుంటే.. పూర్తి కథనం

8. Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్‌

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది. పూర్తి కథనం

9. అక్కడ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే.. నదిని దాటాల్సిందే!

మధ్యప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు బడికి వెళ్లేందుకు సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటుతున్నారు. ఓ చేత్తో యూనిఫాం, మరోచెత్తో చెప్పులు, తలపై పుస్తకాలతో నదిని దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం నది నడుముల్లోతులోనే ప్రవహిస్తున్నా.. అకస్మాత్తుగా నది పొంగితే తమ చిన్నారుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం

10. TS News: పూర్తిస్థాయిలో నీటిపారుదల శాఖ ప్రక్షాళనపై సర్కారు దృష్టి

నీటిపారుదల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంతోపాటు పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈఎన్సీల స్థాయిలో ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా శాఖకు మరో కార్యదర్శిని కూడా నియమించింది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని