Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 31 Aug 2023 13:16 IST

1. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైనా సిద్ధమే: సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం గురువారం బదులిచ్చింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి అవసరమైన నియామవళిని రూపొందిస్తున్నామని, కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Lokesh-Yuvagalam: లోకేశ్‌ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెంలో ప్రారంభమైన పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొని లోకేశ్‌ వెంట నడిచారు. లోకేశ్‌ తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మరోవైపు కొయ్యలగూడెం వద్ద పార్టీ కార్యకర్తలు లోకేశ్‌కు యాపిల్‌ గజమాలతో ఘన స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం దిల్లీలో ఆమె వారిని కలిశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MS Dhoni in Asia Cup: ఆసియా కప్‌ అంటే ధోనీ గుర్తుకొస్తాడు.. ఎందుకంటే..?

ప్రత్యర్థుల ఊహాలకు అందనిరీతిలో వ్యూహాలు పన్నడంలో దిట్ట. ‘కెప్టెన్‌ కూల్‌’ అంటూ సహచరులు ఆప్యాయంగా పిలుచుకునే సారథి. భారత్‌కు వన్డే, టీ20, ఛాంపియన్స్‌ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడు. ఇక IPLలోనూ అతడి నాయకత్వంలోనే సీఎస్‌కే ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన సంగతిని విస్మరించలేం. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. అతడే ఎంఎస్ ధోనీ. భారత క్రికెట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. G20 summit: భారత్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ డుమ్మా..?

జి 20(G20) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్(India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Chinese President Xi Jinping ) హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. US Congress: ఇక భారత్‌లోనే జీఈ విమాన ఇంజిన్ల తయారీ.. అమెరికా కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌

యుద్ధవిమానాల తయారీ రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. జనరల్‌ ఎలక్ట్రిక్‌ (GE) సంస్థ.. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(HAL)తో కలిసి భారత్‌లోనే ఎఫ్‌414 ఫైటర్‌ జెట్‌ ఇంజిన్లను తయారు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్‌ (US Congress) ఆమోదముద్ర వేసింది. ఈ ఇంజిన్లను భారత వాయుసేన కోసం వినియోగించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది సజీవదహనం

దక్షిణాఫ్రికా (South Africa)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అతిపెద్ద నగరమైన జొహన్నెస్‌బర్గ్‌ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 52 మంది సజీవదహనమయ్యారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Trump: అమెరికా ఉపాధ్యక్షుడిగా అతడు తగిన వ్యక్తే..రామస్వామిపై మరోసారి ట్రంప్ ప్రశంసలు

రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy)పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Petrol Price: దిగిరానున్న పెట్రోల్‌ ధరలు.. ఎన్నికల దృష్ట్యా తగ్గించే అవకాశం

వంట గ్యాస్‌ ధర 200 రూపాయలు తగ్గించి ఊరట కలిగించిన కేంద్రం ఎన్నికల సీజన్‌ దృష్ట్యా పెట్రో ధరలు కూడా తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యావసర ధరలు తగ్గించడానికి ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం... పెట్రో ధరల తగ్గింపుపై కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. అలా జరిగితే ద్రవ్యోల్బణం దిగిరానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Harish Rao: అమిత్‌ షా, మల్లికార్జున్‌ ఖర్గే తెలంగాణకు టూరిస్టులు: హరీశ్‌రావు

భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నినాదాల పార్టీ కాదని.. నిజం చేసి చూపించే పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నేత యాతాకుల భాస్కర్‌ హరీశ్‌రావు సమక్షంలో భారాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భాస్కర్‌కు హరీశ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని