Harish Rao: అమిత్‌ షా, మల్లికార్జున్‌ ఖర్గే తెలంగాణకు టూరిస్టులు: హరీశ్‌రావు

భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నినాదాల పార్టీ కాదని.. నిజం చేసి చూపించే పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నేత యాతాకుల భాస్కర్‌ హరీశ్‌రావు సమక్షంలో భారాసలో చేరారు.

Updated : 31 Aug 2023 12:38 IST

హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నినాదాల పార్టీ కాదని.. నిజం చేసి చూపించే పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నేత యాతాకుల భాస్కర్‌ హరీశ్‌రావు సమక్షంలో భారాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భాస్కర్‌కు హరీశ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను విమర్శించే వాళ్లు రాష్ట్ర పరిస్థితిని చూసి మాట్లాడాలన్నారు. తెలంగాణకు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే టూరిస్టుల్లాంటి వారని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ ఆశయాలను నిజం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పార్టీ భారాస అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు