Updated : 30 Nov 2021 13:09 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Gwadar port: పాక్‌ చేపకు చైనా గాలం..!

చైనా ఎక్కడ కాలు పెట్టినా.. అక్కడి సహజ సంపదను దోచేస్తుంది. ఈ క్రమంలో మితృత్వం అన్నమాటనే మర్చిపోతుంది. ఇప్పుడు చైనాతో అంటకాగిన పాపానికి పాకిస్థాన్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గ్వాదర్‌ పోర్టులో స్థానిక ప్రజలనే పరాయి వారివలే చూడటం.. వారికి దక్కాల్సిన సహజ సంపదను చైనీయులు దోచేయడంతో ప్రజలు ఉద్యమించడం మొదలుపెట్టారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా గ్వాదర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Omicron: ఒమిక్రాన్‌పై ఆందోళన ఉన్నా.. భయపడాల్సిన అవసరం లేదు: బైడెన్‌

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ను అడ్డుకోవడం కోసం ఆస్ట్రేలియా, జపాన్‌ సహా పలు దేశాలు మళ్లీ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయాణాలపై ఆంక్షలతోపాటు సరిహద్దుల్ని మూసివేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి తీవ్రమైతే లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉన్నాయి. అయితే, అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఇప్పట్లో రాదని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. గతేడాది మే నాటి స్థాయికి మహమ్మారి

3. ధాన్యం కొనలేకపోతే రూ.వేల కోట్ల ప్రాజెక్టులు, రైతుబంధు ఎందుకు?: రేవంత్

ధాన్యం కొనుగోలుపై తెరాస, భాజపా కలిసి నాటాకాలు ఆడుతున్నాయని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం తన రైతు వ్యతిరేక బుద్ధిని మరోసారి చాటుకుందన్నారు. రైతుల సంక్షేమం గురించి కేసీఆర్‌ ఎందుకు ఆలోచించడం లేదని రేవంత్‌ మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని రేవంత్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా దిల్లీ వెళ్లిన ఆయన అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Winter Session: ఎంపీల సస్పెన్షన్‌పై ఉభయ సభల్లో గందరగోళం

12 మంది ఎంపీల సస్పెన్షన్ వేటు రాజ్యసభలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని, ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మరోవైపు, ఛైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. విపక్ష నేతల విజ్ఞప్తిని తిరస్కరించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలంతా కూర్చోవాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Kapil Dev’s 83: కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌.. ‘83’ ట్రైలర్‌ వచ్చేసింది!

టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించారు. కపిల్‌దేవ్‌ భార్యగా రణ్‌వీర్‌ సరసన దీపికా పదుకొణె నటించారు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ‘అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత అద్భుతమైన కథ. ట్రైలర్‌ హిందీ వెర్షన్‌ మీకోసం’ అంటూ రణ్‌వీర్‌ సింగ్‌ చిత్ర ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Brahmanandam: 35ఏళ్లు నిర్విరామంగా పనిచేశా.. అందుకే ఈ నిర్ణయం!

6. IND vs NZ: గండి కొట్టింది మనోళ్లే.. రచిన్‌ రవీంద్ర, అజాజ్‌ పటేల్‌ ఎవరో తెలుసా?

చిన్‌ రవీంద్ర.. ఈ పేరు చూస్తే భారతీయుడని అర్థమైపోతుంది. కానీ అతడు పుట్టింది, పెరిగింది న్యూజిలాండ్‌లో. ఇప్పుడు ఆ దేశ జాతీయ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆర్కిటెక్ట్‌ అయిన రచిన్‌ తండ్రి కృష్ణమూర్తిది బెంగళూరు. ఆయన మాజీ పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌తో కలిసి దేశవాళీ క్రికెట్‌ కూడా ఆడాడు. ఉద్యోగ రీత్యా 90వ దశకంలోనే కుటుంబంతో సహా న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడ్డ కృష్ణమూర్తి.. అక్కడే పుట్టిన తన కొడుకును క్రికెటర్‌ను చేయాలనుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పెద్ద చదువులు చదివితేనే పేదల తలరాతలు మారతాయి: సీఎం జగన్‌

ద్యార్థులు ఏ విషయంలోనూ ఇబ్బందులు పడకూడదని.. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న విద్యాదీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను సీఎం విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా రాష్ట్రంలోని దాదాపు 11.03లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: అధికారం ఉందని బరితెగిస్తే బడితెపూజ ఖాయం: అచ్చెన్నాయుడు

8. WhatsApp: ఈ చిన్న ట్రిక్‌తో నంబర్‌ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్‌!

వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ పంపాలంటే వారి నంబర్‌ మన కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్‌ చేసుకోవాల్సిందే. ఒక్కోసారి జిరాక్స్‌ షాప్‌కు వెళ్లినప్పుడో, వెరిఫికేషన్‌ కోసం ఏదైనా డాక్యుమెంట్ పంపాల్సినప్పుడో అవతలి వ్యక్తికి వాట్సాప్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో నంబర్‌ సేవ్‌ చేయాల్సిందే. నిజానికి ఆ సమయంలో తప్ప వారి నంబర్‌ మనకు పెద్దగా అవసరం ఉండదు. అయినా సేవ్‌ చేసుకోవడం వల్ల మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండిపోతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Elon Musk: భారతీయుల ప్రతిభపై ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే..

భారతీయుల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగంలో మనదేశ ప్రభ వెలిగిపోతోంది. ఐటీలో మేటిగా ఎదిగిన భారత్‌.. మేలిమి నిపుణులకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ వంటి ప్రపంచస్థాయి టాప్ కంపెనీల సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పరాగ్‌ అగర్వాల్‌ చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: గురుకులంలో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ గురుకులంలో నిన్న 47 మంది విద్యార్థినులు కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. కాగా కొవిడ్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చినా 25 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. ముగ్గురికి తీవ్రంగా ఉండటంతో వారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ 25 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని వైద్యులు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Hyderabad News: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ప్లైఓవర్‌పై కారు దగ్ధం

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని