Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jul 2023 13:16 IST

1. కోడికత్తి కేసు.. బెయిల్‌కు సుప్రీంకోర్టుకు వెళ్లండి: నిందితుడికి ఎన్‌ఐఏ కోర్టు సూచన

కోడికత్తి కేసుపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించాడు. బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు అతడికి స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్‌ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కమిన్స్‌వైపు బెయిర్‌స్టో సీరియస్‌ లుక్‌.. వీడియో వైరల్‌

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ (Ashes 2023) రెండో టెస్టు సందర్భంగా బెయిర్‌స్టో (Bairstow)ను ఔటైన తీరుపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. తనకు ఎదురుపడిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ  బెయిర్‌స్టో హావభావాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అదేంటో మీరూ చూసేయండి..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌కు ప్రమాదం..!

ప్రముఖ బాలీవుడ్ హీరో షారుక్‌ ఖాన్‌కు ( Shah Rukh Khan) ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్‌ ప్రమాదానికి గురయ్యారట. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం భారత్‌కు తిరిగి వచ్చారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మోదీ 8న ఉదయం దిల్లీ నుంచి బయల్దేరి 9.45 గంటలకి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరతారు. 10.35కి అక్కడి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్‌ మద్దతుదారుల దుశ్చర్య.. ఖండించిన అమెరికా

ఖలిస్థాన్‌ మద్దతుదారుల శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం(Indian Consulate in San Francisco)పై దాడికి పాల్పడ్డారు. దానిని దహనం చేయడానికి ప్రయత్నించారు. నెలల వ్యవధిలో రెండోసారి ఈ తరహా దుశ్చర్య జరగ్గా.. దీనిని అమెరికా(US) ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నేరపూరిత చర్య అంటూ అభివర్ణించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్స్‌’.. మెటా కొత్త యాప్

ట్విటర్‌ (Twitter)కు పోటీగా మెటా (Meta) కొత్తగా టెక్స్ట్‌ ఆధారిత సంభాషణల యాప్‌ను తీసుకువస్తోంది. ‘థ్రెడ్స్‌’ (Threads) పేరుతో తీసుకువస్తోన్న ఈ మైక్రో బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఈ వారంలోనే వినియోగదారులకు పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌ తరహా ఫీచర్లతోనే దీన్ని తీసుకురావటం విశేషం. కానీ, ఈ అంశంపై మెటా యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం.. కొత్త ఆంక్షలు విధించిన తాలిబన్లు

 అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహిళల హక్కులను కాలరాస్తూ.. కొత్త నిబంధనలను తాలిబన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాబూల్‌లోని మహిళల బ్యూటీ సెలూన్‌ (Beauty Salon)లపై నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్‌ మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్‌ (Kabul)మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘రూ.7 లక్షలిస్తే నీట్‌ పరీక్ష రాసిపెడతాం..’: దిల్లీ ఎయిమ్స్‌ విద్యార్థుల ఘరానా మోసం

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలో భారీ మోసం (NEET racket)బయటపడింది. నీట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో ఓ ముఠా పరీక్ష (NEET Exam) రాయిస్తోంది. దేశ రాజధాని దిల్లీలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్‌ (Delhi AIIMS) విద్యార్థులు నడిపిస్తున్న ఈ ‘నీట్‌ రాకెట్‌’ను దిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా నాయకుడు సహా ఇప్పటివరకు నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అనారోగ్యమైతే ప్రమాణ స్వీకారం ఆపాలా..? ఇదేం వింత..! దిల్లీ ప్రభుత్వంపై ఎల్జీ ఆగ్రహం

దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi)లో లెఫ్టినెంట్ గవర్నర్‌(Delhi Lt Governor), ఆప్‌ ప్రభుత్వం(AAP Govt) మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (DERC) కొత్త ఛైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. తన అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆప్‌ నేత, విద్యుత్ శాఖ మంత్రి అతిషి వాయిదా వేయగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సముద్రంపై సరస్సు.. చూస్తే ఔరా అనాల్సిందే!

నదులు సముద్రంలో కలిసే సంగమ ప్రదేశాలు మీరు ఎక్కడైనా చూసుంటారు. కానీ, సముద్రానికి అల్లంత ఎత్తులో సరస్సు ఉండటం చూశారా? అలా కూడా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఫోరే దీవులకు వెళ్లాల్సిందే. డెన్మార్క్‌ సమీపంలో ఉన్నాయి ఈ దీవులు. ఇక్కడి వాగర్‌ ద్వీపం వద్ద సర్వాగ్‌స్వాటన్‌ సరస్సు ప్రవహిస్తోంది. సర్వాగర్‌, వాగర్‌ మున్సిపాలిటీల మధ్యలో ప్రవహిస్తున్న ఈ సరస్సు 3.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని