PM Modi: ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

Published : 04 Jul 2023 12:38 IST

వరంగల్‌: ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మోదీ 8న ఉదయం దిల్లీ నుంచి బయల్దేరి 9.45 గంటలకి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరతారు. 10.35కి అక్కడి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 

10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు బహిరంగసభలో మెదీ ప్రసంగిస్తారు. అనంతరం 12.15కి వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 1.10 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌ పర్యటనకు ప్రధాని వెళ్లనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని