Shah Rukh Khan: బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌కు ప్రమాదం..!

బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌కు ( Shah Rukh Khan) ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసినట్లు సమాచారం.

Updated : 04 Jul 2023 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్ హీరో షారుక్‌ ఖాన్‌కు ( Shah Rukh Khan) ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్‌ ప్రమాదానికి గురయ్యారట. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం భారత్‌కు తిరిగి వచ్చారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు.

ప్రస్తుతం షారుక్‌ అట్లీ దర్శకత్వంలో ‘జవాన్‌’లో (Jawan) నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్‌ సరసన నయనతార నటిస్తోన్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనుంది. అలాగే రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ‘డుంకీ’(Dunki)లోనూ షారుక్‌ ఖాన్‌ నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని