Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Jul 2023 13:15 IST

1. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకం: మోదీ

దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి ఇది స్వర్ణ సమయమని చెప్పారు. వరంగల్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్రాక్టర్‌తో దుక్కి దున్ని.. వరి నాట్లు వేసిన రాహుల్‌

కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రైతుగా మారారు. శనివారం ఉదయం హరియాణా (Haryana)లోని సోనిపట్‌లో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. పొలంలోకి దిగి ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. నాట్లేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్‌ తమ ట్విటర్‌ ఖాతాలో పంచుకోగా.. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అదానీ కంపెనీకి చెందిన 6వేల కేజీల ఇనుప వంతెన మాయం..!

చడీచప్పుడు లేకుండా 90 అడుగుల పొడవైన, 6 వేల కేజీల ఇనుప వంతెన(bridge ) మాయమైంది. నిత్యం బిజీగా ఉండే ముంబయి (Mumbai)లోని మలాడ్ ప్రాంతం ఇది కనిపించకుండా పోయింది. అది అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ (Adani Electricity)కు చెందిన వంతెన అని, ఈ చోరీ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఐ స్వర్ణలత సినీ ప్రేమ.. డ్యాన్స్‌లతో సోషల్‌మీడియాలో హల్‌చల్‌

నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్‌ సీఐ స్వర్ణలత (CI Swarnalatha) అరెస్టు కావడం సంచలనం రేపింది. వృత్తిలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె.. ప్రవృత్తి పరంగా వెండితెరపై మక్కువ పెంచుకున్నారు. సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత కొంతకాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్‌ చేశారు. చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సామాజిక మాధ్యమాల్లో (Viral Videos) హల్‌చల్‌ చేశారు. తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, ఇందుకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడంతో ఒక కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని సాధన చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మా నిర్ణయం సరైనదే..! సమర్థించుకున్న బైడెన్‌

 ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య (Ukraine Crisis) మొదలుపెట్టి 500 రోజులవుతోంది. మొదట్లో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌ (Ukraine).. పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో క్రమంగా మాస్కోపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా (America) కీలక ప్రకటన చేసింది. అత్యంత ప్రమాదకర ‘క్లస్టర్‌ బాంబు (Cluster Bombs)’లను అందజేయాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగన్‌ పర్యటన బందోబస్త్‌.. అల్పాహారం కోసం ఎగబడిన పోలీసులు

అనంతపురం జిల్లా కల్యాదుర్గంలో సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పోలీస్‌ సిబ్బంది ఆకలితో అలమటిస్తున్నారు. బందోబస్తు కోసం వేకువజామున 3 గంటలకే వచ్చినా.. ఉదయం 10 గంటలైనా అల్పాహారం ఇవ్వకపోవడంతో పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని హోటళ్లు,దుకాణాలు మూసివేతతో టిఫిన్‌ దొరక్క అవస్థలు పడుతున్నారు. దీర్ఘకాలిక జబ్బులు, షుగర్‌, బీపీ ఉన్న సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒక వాహనంలో అల్పాహారం తీసుకురావడంతో పొట్లాల కోసం ఖాకీలు ఎగబడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. 9 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘర్షణల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో కొందరు తృణమూల్‌ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని టీఎంసీ తమ ట్విటర్‌ ఖాతాలో వెల్లడిస్తూ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒక రైలులో నుంచి మరో రైలు ప్రయాణికులను బెల్టుతో కొట్టి.. విపరీత చర్యపై తీవ్ర విమర్శలు

రైలు(Train) ప్రయాణంలో ఓ వ్యక్తి విపరీత చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. ఓ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి పక్కన పట్టాలపై వెళ్తోన్న మరో రైలు డోర్‌ దగ్గర కూర్చుకున్న ప్రయాణికులను బెల్ట్‌తో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ‘మరో రైలులో డోర్‌ దగ్గర కూర్చొని ప్రయాణిస్తోన్న వారిని ఈ వ్యక్తి బెల్ట్‌తో కొడుతున్నాడు. ఇది నిజమేనా..? ఇలాంటి చర్యల వల్ల ప్రయాణికులు రైలులో నుంచి కిందపడిపోయే ప్రమాదం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాక్‌ మహిళకు ఆకర్షితులై.. క్షిపణి రహస్యాలు చెప్పిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త

భారత రక్షణ రంగానికి (Defence Sector) చెందిన అత్యంత రహస్యమైన క్షిపణి (Indian missile systems) సమాచారాన్ని పాకిస్థాన్‌ (Pakistan)కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై డీఆర్‌డీవో శాస్త్రవేత్త (DRDO scientist) ప్రదీప్‌ కురుల్కర్‌ (Pradeep Kurulkar) ఇటీవల అరెస్టయ్యారు. ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌ (ATS) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కార్డుతో పనిలేకుండా ఫోన్‌తో క్యాష్‌ విత్‌డ్రా

 డెబిట్‌ కార్డ్‌ మర్చిపోయారా? అయినా డబ్బు విత్‌డ్రా చేసుకోవాలా? మీ చేతిలో మొబైల్‌ ఉంటే చాలు.. ఏటీఎం (ATM)లో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ సాయంతో డబ్బు తీసుకొనే సదుపాయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డు ర‌హిత‌ నగదు ఉపసంహరణను (Cardless cash withdrawal) ప్రవేశపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని