Rahul Gandhi: ట్రాక్టర్‌తో దుక్కి దున్ని.. వరి నాట్లు వేసిన రాహుల్‌

హరియాణా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రైతులతో కలిసి వ్యవసాయ పనులు చేశారు. ట్రాక్టర్‌తో దుక్కి దున్ని వరి నాటేశారు.

Updated : 08 Jul 2023 11:46 IST

సోనిపట్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) రైతుగా మారారు. శనివారం ఉదయం హరియాణా (Haryana)లోని సోనిపట్‌లో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. పొలంలోకి దిగి ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. నాట్లేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్‌ తమ ట్విటర్‌ ఖాతాలో పంచుకోగా.. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.

దిల్లీ (Delhi) నుంచి శిమ్లా (హిమాచల్‌ప్రదేశ్) వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలో సోనిపట్‌లో ఆగారు. బరోడా, మదీనాలోని పలు గ్రామాల్లో తిరిగిన ఆయన.. పొలం పనుల్లో ఉన్న రైతులతో ముచ్చటించారు. ఆ తర్వాత పొలంలోకి దిగి ట్రాక్టర్‌ నడిపారు. రైతులతో కలిసి వరి నాట్లేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టిన తర్వాత నుంచి రాహుల్‌ (Rahul Gandhi) ఈ మధ్య కాలంలో అనేక రంగాలకు చెందిన ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల దిల్లీ - చండీగఢ్‌ హైవేపై  ట్రక్కు నడిపి లారీ డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆయన.. ఆ తర్వాత ఓ మెకానిక్‌ దుకాణంగా బండిని రిపేర్‌ చేస్తూ కన్పించారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన సమయంలోనూ రాహుల్‌ ట్రక్కులో ప్రయాణించిన విషయం తెలిసిందే. కాగా.. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ రాహుల్‌ ట్రాక్టర్‌ నడిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని