ఒక రైలులో నుంచి మరో రైలు ప్రయాణికులను బెల్టుతో కొట్టి.. విపరీత చర్యపై తీవ్ర విమర్శలు

Viral Video: ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలిసి కూడా కొందరు ప్రవర్తన మార్చుకోరు. ఈ తరహాలో ఓ వ్యక్తి తనతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..?

Updated : 08 Jul 2023 12:56 IST

పట్నా: రైలు(Train) ప్రయాణంలో ఓ వ్యక్తి విపరీత చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. ఓ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి పక్కన పట్టాలపై వెళ్తోన్న మరో రైలు డోర్‌ దగ్గర కూర్చుకున్న ప్రయాణికులను బెల్ట్‌తో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది.

‘మరో రైలులో డోర్‌ దగ్గర కూర్చొని ప్రయాణిస్తోన్న వారిని ఈ వ్యక్తి బెల్ట్‌తో కొడుతున్నాడు. ఇది నిజమేనా..? ఇలాంటి చర్యల వల్ల ప్రయాణికులు రైలులో నుంచి కిందపడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన బిహార్‌(Bihar)లో జరిగిందని తెలుస్తోంది. అయితే ఎప్పుడు జరిగిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. 

ఈ వీడియోపై తూర్పుమధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని తెలిపారు. ఇలాంటి ప్రమాదకర చర్యను తమ దృష్టికి తీసుకువచ్చినందుకు అభినందించారు. శుక్రవారం నుంచి నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌ అవుతుండగా..  అతడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని అరెస్టు చేయాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని