cash withdraw: కార్డుతో పనిలేకుండా ఫోన్‌తో క్యాష్‌ విత్‌డ్రా

Cardless cash withdrawl: డెబిట్‌ కార్డ్‌తో పనిలేకుండా ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసే సదుపాయాన్ని ఆర్‌బీఐ కల్పించింది. అదెలాగో చూసేయండి.

Updated : 08 Jul 2023 12:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డెబిట్‌ కార్డ్‌ మర్చిపోయారా? అయినా డబ్బు విత్‌డ్రా చేసుకోవాలా? మీ చేతిలో మొబైల్‌ ఉంటే చాలు.. ఏటీఎం (ATM)లో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ సాయంతో డబ్బు తీసుకొనే సదుపాయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డు ర‌హిత‌ నగదు ఉపసంహరణను (Cardless cash withdrawal) ప్రవేశపెట్టింది. దీంతో ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్స్‌ ద్వారా డెబిట్‌ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

యూపీఐ సాయంతో నగదు విత్‌డ్రా

  • ఫోన్‌ పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్‌తో పాటు ఆయా బ్యాంక్‌ యాప్స్‌ను సైతం వినియోగించొచ్చు. ఎస్‌బీఐ వినియోగదారులైతే.. యోనో, ఐసీఐసీఐ బ్యాంక్‌ హోల్డర్లయితే ఐమొబైల్‌ యాప్‌ను వినియోగించొచ్చు.
  • ముందుగా సదరు ఏటీఎం యూపీఐ సదుపాయం పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. మన ఫోన్‌లో ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. 
  • తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై విత్‌డ్రా సెక్షన్‌లో ‘క్యూఆర్‌ క్యాష్‌’ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • అప్పుడు తాత్కాలిక క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ అవుతుంది. దీన్ని కేవలం ఒకసారి మాత్రమే వినియోగించుకొనేందుకు వీలుంటుంది.
  • ఆ తర్వాత మీ యాప్‌లో ఉన్న ‘QR code scanner’ ఆప్షన్‌ ఉపయోగించి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేయాలి.
  •  ఆ తర్వాత యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ పూర్తి చేయొచ్చు.
  • Also Read: యూపీఐ సదుపాయాలతో ఎస్‌బీఐ యోనో యాప్‌

నెలకు రూ.లక్ష వరకు యూపీఐ ఆధారంగా ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకుల నియమ నిబంధనల ఆధారంగా రోజువారీ విత్‌డ్రా పరిమితులు ఉంటాయి. ఈ విత్‌డ్రా సమయంలో ఏదైనా అంతరాయం ఎదురై డబ్బు రాకున్నా వెంటనే దగ్గర్లో ఉన్న బ్యాంక్‌లో తెలియజేయాలి. దీంతో కొద్దిరోజుల్లోనే ఆ డబ్బు తిరిగి మీ అకౌంట్‌లో జమ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని