Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Jul 2023 13:22 IST

1. Telangana Rains: ఈ జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. అనుమతించిన స్పీకర్‌

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. బుధవారం ఉదయం విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా అనుమతించారు. ‘దీనిపై నేను అన్ని పార్టీలతో చర్చిస్తాను. ఆ తర్వాత చర్చకు సమయం ప్రకటిస్తాను’ అని స్పీకర్ వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వడగళ్ల వాన దెబ్బకు విమానం గుల్ల.. అత్యవసర ల్యాండింగ్‌..!

ఇటలీలోని మిలన్‌ (Milan) నుంచి అమెరికా (USA)లోని న్యూయార్క్‌(New York) జేకేఎఫ్‌ ఎయిర్‌ పోర్టుకు బయల్దేరిన విమానం తీవ్రంగా దెబ్బతిని రోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 185 నంబర్‌ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్‌ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉంది. కానీ, ప్రయాణం ఆరంభించిన 15 నిమిషాల తర్వాత తీవ్రమైన వడగళ్లు, పిడుగులతో కూడిన వానలో చిక్కుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వేర్వేరు ఈపీఎఫ్‌ ఖాతాలు ఉన్నాయా? విలీనం చేయకపోతే ఏమవుతుంది?

సరికొత్త అవకాశాలు, మెరుగైన జీతాలు ఆశిస్తూ ఇతర ఉద్యోగాలకు వెళ్లటం సహజమే. అయితే ఇలా ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త ఈపీఎఫ్‌ (EPF) ఖాతాలు తెరుస్తారు. కానీ, వాటిని విలీనం చేయరు. ఎలా విలీనం చేయాలో తెలియక కొందరు.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలియక మరికొందరు దీన్ని విస్మరిస్తుంటారు. ఒకవేళ మీకూ వేర్వేరు ఈపీఎఫ్‌ ఖాతాలుంటే వాటిని ఎలా విలీనం చేయాలో తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం చేస్తాం: నోరుజారిన మంత్రి పెద్దిరెడ్డి

ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ముఖ్యమంత్రిని చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddi Ramachandra Reddy) నోరు జారారు. చిత్తూరు జిల్లా కుప్పం పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం పర్యటన భాగంగా ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని చెప్పబోయి... ముఖ్యమంత్రిని చేస్తారని మంత్రి నోరు జారారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ మారింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ChatGPT app: చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యాప్ వచ్చేసింది

చాట్‌జీపీటీ (ChatGPT) ఆండ్రాయిడ్ యాప్ సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఐఫోన్ (IOS) యూజర్లకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను పరిచయం చేయగా.. నిన్న రాత్రి నుంచి ఆండ్రాయిడ్‌ వినియోగదారులకూ ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. భారత్‌తో పాటు అమెరికా, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌ దేశాల్లో ఈ సేవలు ప్రారంభించినట్లు ఓపెన్ ఏఐ (OpenAI) తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. భవిష్యత్తులో ఈ సేవలు మరిన్ని దేశాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టిఫిన్‌ కోసం బస్‌ దిగాడు.. రూ.28లక్షలు హాంఫట్‌

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్‌ వద్ద భారీ చోరీ జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్‌ వద్ద ఆగింది. ఒడిశాలోని బరంపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి టిఫిన్‌ తినేందుకు అక్కడ దిగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్ నియంత్రణ రేఖ దాటడానికి సిద్ధంగా ఉంది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత్‌ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని.. ప్రజలు కూడా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు. ఆయన ద్రాస్‌లోని కార్గిల్‌ యద్ధ స్మారకం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నేడు దేశవ్యాప్తంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మదనపల్లె మార్కెట్‌లో రికార్డు స్థాయికి టమాటా ధర

మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్‌ పరిధిలో బుధవారం రికార్డు స్థాయిలో కిలో నాణ్యమైన టమాటా రూ.168 పలికింది. మార్కెట్‌కు రైతులు కేవలం 361 టన్నులు మాత్రమే తీసుకువచ్చారు.  మార్కెట్‌లో ఏ గ్రేడ్‌ కిలో రూ.140 నుంచి రూ.168, బీ గ్రేడ్‌ రూ.118 నుంచి రూ.138 వరకు.. సగటున కిలో రూ.132 నుంచి రూ.156 వరకు పలికిందని మార్కెట్‌ యార్డు కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఏంటీ సూపర్‌ యాప్స్‌..? వీటితో కస్టమర్లకు ఎంతమేర ఉపయోగం!

ట్విటర్‌ (Twitter)ను సూపర్‌ యాప్‌ (Super App)గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్(X)గా పేరు మార్చినట్లు ఎలాన్‌ మస్క్ (Elon Musk) ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సూపర్‌ యాప్‌ అంశం చర్చనీయాంశమైంది. ఇంతకీ సూపర్ యాప్‌ అంటే ఏంటి? మొదటగా దీన్ని ఎవరు ప్రారంభించారు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సూపర్‌ యాప్‌లు ఉన్నాయి? ఎక్స్‌ (ట్విటర్‌)తోపాటు ఇంకా ఏయే కంపెనీలు సూపర్‌ యాప్‌లను తీసురానున్నాయి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని