USA: వడగళ్ల వాన దెబ్బకు విమానం గుల్ల.. అత్యవసర ల్యాండింగ్‌..!

వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం వడగళ్ల వానలో చిక్కుకొంది. దీంతో విమానం ముక్కు భాగంలో రంధ్రం పడింది. అదృష్టవశాత్తు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

Updated : 26 Jul 2023 10:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటలీలోని మిలన్‌ (Milan) నుంచి అమెరికా (USA)లోని న్యూయార్క్‌(New York) జేకేఎఫ్‌ ఎయిర్‌ పోర్టుకు బయల్దేరిన విమానం తీవ్రంగా దెబ్బతిని రోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 185 నంబర్‌ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్‌ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉంది. కానీ, ప్రయాణం ఆరంభించిన 15 నిమిషాల తర్వాత తీవ్రమైన వడగళ్లు, పిడుగులతో కూడిన వానలో చిక్కుకుంది. దీంతో విమానం ముక్కు, రెక్కలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. విమానాన్ని నియంత్రించడం పైలట్లకు ఇబ్బందికరంగా మారింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా రోమ్‌లో ల్యాండింగ్‌ చేశారు.

ప్రాణాంతక ‘మెర్స్‌’ కలకలం

ఈ విషయంపై డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మిలన్‌ నుంచి న్యూయార్క్‌ బయల్దేరిన డెల్టా ఫ్లైట్‌ 185ను వాతవరణం కారణంగా రోమ్‌లో ల్యాండ్‌ చేశాం. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు’’ అని వెల్లడించారు. ప్రస్తుతం విమానం స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. విమానానికి జరిగిన నష్టాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, ప్రయాణికులు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన చిత్రాల్లో విమానం ముక్కు పూర్తిగా ధ్వంసమైనట్లు ఉంది. దీంతోపాటు రెండు ఇంజిన్లు, రెక్కలు కూడా వడగళ్ల కారణంగా దెబ్బతిన్నాయి. విమానంలో 215 మంది ప్రయాణికులు, 8 మంది సహాయక సిబ్బంది, ముగ్గురు పైలట్లు ఉన్నారు.

వడగళ్ల వర్షంలో చిక్కుకొన్నాక విమానం ఒక్కసారిగా అదుపు తప్పిందని ప్రయాణికులు వెల్లడించారు. ఒక దశలో విమానం ముక్కలైపోతుందేమోనని తాము భయపడ్డామని ఓ ప్రయాణికురాలు పత్రికలకు వెల్లడించారు. రోలర్‌ కోస్టర్‌ ఎక్కినట్లు తమకు అనిపించిందని తన అనుభవాన్ని పంచుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు