ChatGPT app: చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యాప్ వచ్చేసింది

ChatGPT app: ఇప్పటివరకు ఐఫోన్‌ యూజర్లకు మాత్రమే పరిమితమైన చాట్‌జీపీటీ సేవలు నిన్న రాత్రి నుంచి ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

Updated : 26 Jul 2023 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT) ఆండ్రాయిడ్ యాప్ సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఐఫోన్ (IOS) యూజర్లకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను పరిచయం చేయగా.. నిన్న రాత్రి నుంచి ఆండ్రాయిడ్‌ వినియోగదారులకూ ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. భారత్‌తో పాటు అమెరికా, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌ దేశాల్లో ఈ సేవలు ప్రారంభించినట్లు ఓపెన్ ఏఐ (OpenAI) తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. భవిష్యత్తులో ఈ సేవలు మరిన్ని దేశాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన దాదాపు రెండు నెలల తర్వాత చాట్‌జీపీటీ సేవలను ఆండ్రాయిడ్ యూజర్లకు అందించింది.

సూపర్‌ యాప్‌గా ‘ఎక్స్‌’!

గూగుల్‌ ప్లే స్టోర్ ద్వారా చాట్‌జీపీటీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునీ ఈ సేవలు పొందవచ్చు. ఇందులో వాయిస్‌ సెర్చింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. సలహాలు, సమాధాలు కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. చాట్‌ హిస్టరీ, డేటా ఎక్స్‌పోర్ట్ ఆప్షన్లను అందిస్తోంది. అయితే ఐఫోన్‌లో అందించే ప్లగిన్ వంటి కొన్ని ఫీచర్లను మాత్రం ఇంకా ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి తీసుకురాలేదు. వివిధ డొమైన్లను విస్తరించటం, కంటెంట్ జనరేషన్‌, కోడింగ్ అసిస్టెంట్, పుస్తక సారాంశాలను అందించటం ఇలా.. ఏ సమాధానాలైనా చాట్‌జీపీటీ అందిస్తోంది. ఈ AI చాట్‌బాట్‌కు మల్టీటాస్కింగ్‌ చేయగల సామర్థ్యం ఉండటంతో దీన్ని ఉపయోగించేందుకు నెటిజన్లు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని