Telangana Rains: ఈ జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Updated : 26 Jul 2023 13:10 IST

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.

కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. సహాయం కోసం 9000113667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపింది. 70లక్షల మందిని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అప్రమత్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని