Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 06 May 2023 17:21 IST

1. అన్నిసార్లు అవకాశమిస్తే కాంగ్రెస్‌ ఏం చేసింది?: మంత్రి కేటీఆర్‌

ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్‌.. ఇప్పుడు ఇరిగేషన్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే.. పాలమూరులోనా అని ఒకప్పుడు పాటలు ఉండేవని.. ఇప్పుడు పల్లెపల్లెనా పసిడి పంటలు పండే.. అని పాడుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైస్‌ మిల్‌ సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే గోవర్ధన్‌

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ వివాదంలో చిక్కుకున్నారు. బిక్నూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని పూర్ణిమ రైస్‌మిల్‌లో పనిచేసే సిబ్బందిపై ఆయన చేయి చేసుకోవడమే వివాదానికి కారణమైంది. గత కొద్ది రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైస్‌మిల్లులో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమస్య ఉందని గత కొన్ని రోజులుగా రైతులు ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణకు వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

మరో 3గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం సాయంత్రం తెలిపింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఖర్గే హత్యకు భాజపా కుట్ర’.. ఆడియో క్లిప్‌ రిలీజ్‌ చేసిన కాంగ్రెస్‌

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కర్ణాటక (Karnataka Elections) రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ (Congress) విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌ మరోసారి కలకలం రేపింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge) హతమార్చేందుకు భాజపా (BJP) అభ్యర్థి కుట్ర పన్నారంటూ ఆ పార్టీ ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రహానె ఆటంటే నాకెప్పుడూ ఇష్టమే: గంగూలీ

ఐపీఎల్‌-16 (IPL)లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane)పై భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) ప్రశంసలు కురిపించాడు. అతడి ఆట అంటే తనకు ముందు నుంచే ఇష్టమని.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో (WTC) గొప్పగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫోన్‌పేలో యూపీఐ లైట్‌ ఫీచర్‌.. ఎలా వాడాలంటే?

యూపీఐ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న మొత్తాలకూ యూపీఐని వినియోగించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. ఏ చిన్న వస్తువు కొన్నా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి బ్యాంకు ఖాతాలోని డబ్బులు చెల్లించొచ్చు. ఇందుకోసం యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పిన్‌ ఎంటర్‌ చేసే పని కూడా లేకుండా మరింత సులభంగా చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) యూపీఐ లైట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆర్మీలో అవకాశాన్ని చేజార్చుకున్నా.. అయితేనేం శివ‘సైనికుడి’నయ్యా!

ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)పై తిరుగుబాటు, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భాజపా (BJP)తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాల్లో ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్‌ శిందే.. తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫలించిన 80 ఏళ్ల పోరాటం.. 93 ఏళ్ల మహిళకు దక్కిన ఆస్తి

వారసత్వ ఆస్తి కోసం ఓ మహిళ చేసిన అలుపెరగని న్యాయ పోరాటం ఫలించింది. ఎనిమిది దశాబ్దాల భూవివాదాన్ని పరిష్కరిస్తూ 93 ఏళ్ల అలిస్‌ డిసౌజాకు ఆ ఆస్తి తిరిగిచ్చేయాలని బాంబే హైకోర్టు (Bombau High Vourt) మహారాష్ట్ర ప్రభుత్వాన్ని (Maharashtra Govt) ఆదేశించింది. దీంతో 80 ఏళ్ల తర్వాత రెండు ఫ్లాట్లు తిరిగి ఆ బామ్మకు దక్కబోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ది కేరళ స్టోరీ’కి మధ్యప్రదేశ్‌ పన్ను మినహాయింపు

మత మార్పిడిలపై రూపొందిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం (Madhya Pradesh) పన్ను మినహాయింపు ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. పిల్లలు, పెద్దలూ అందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలన్నారు. ‘మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే మత మార్పిడుల నిరోధానికి చట్టం తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఛార్లెస్ పట్టాభిషేకం వేళ.. మేఘన్‌ మార్కెల్‌పై ప్యాలెస్‌ ప్రకటన ఏంటంటే..?

ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్‌ వైపే ఉంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందక్కడ. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌(Charles III)కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి నేడు కిరీటధారణ చేయనున్నారు. ఈ సమయంలో రాజకుటుంబం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని