Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 19 Apr 2023 17:05 IST

1. జగన్‌ ఇక జన్మలో సీఎం కాలేరు: చంద్రబాబు

గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా పార్టీ వెంట ఉంటుందని కార్యకర్తలకు సూచించారు. తెదేపా పాలన వల్ల విదేశాల్లో స్థిరపడిన వారంతా పార్టీకి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో మోస్తరు వర్షాలు: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం వాయవ్య తెలంగాణ, గురువారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమో.. రక్షణ కల్పించండి: దస్తగిరి

ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత తనపై కక్ష కట్టారని మాజీ మంత్రి వైఎస్‌  వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలిపారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘పులివెందుల వైకాపా శ్రేణులు, అవినాష్‌ అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ విషయంలో సచిన్‌ను అధిగమించిన అర్జున్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)తో మ్యాచ్‌ను సచిన్‌(Sachin Tendulkar) తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌(Arjun Tendulkar) ఎప్పటికీ మరిచిపోలేడు. ఎందుకంటే ఎంతో ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. ఐపీఎల్‌(IPL) కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించాడు ఈ యువ పేసర్‌. అర్జున్‌ వికెట్‌ సాధించిన సమయంలో ముంబయి(mumbai indians) డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే సచిన్‌ సంబరాలు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విమాన ప్రయాణాల్లో బిగ్‌ జంప్‌.. విమాన సంస్థల్లో ఇండిగోనే టాప్‌

దేశీయ విమానయాన రంగం పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటోంది. కొవిడ్‌ సమయంలో అతలాకుతలం అయిన ఈ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయంగా ఏకంగా 3.75 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే సమయంలో 2.47 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 51.7 శాతం మేర పెరగడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సుప్రీంకోర్టులో గాలి జనార్దన్‌రెడ్డికి చుక్కెదురు

కర్ణాటక మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో బెయిల్‌ నిబంధనల సడలింపునకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్దన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సాయిబాబా కేసును మరోసారి విచారించండి.. బాంబే హైకోర్టు తీర్పు పక్కనపెట్టిన సుప్రీం

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై నమోదైన కేసు(Maoist links case)లో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబా (professor Saibaba)ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court)ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) పక్కన పెట్టింది. ఆ కేసును మరోసారి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌ జనాభా 142.86కోట్లు.. చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!

ప్రపంచంలో అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస (United Nations) బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మెటాలో మరో 10,000 మంది ఉద్యోగుల తొలగింపు?

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా (Meta Layoffs) మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యయ నియంత్రణలో భాగంగా దాదాపు మరో 10,000 మందిని తొలగించాలని మెటా (Meta Layoffs) నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమెరికాలో కాల్పులు..ఓ ఇంట్లో నలుగురి మృతి

అమెరికా(United States)లోని మెనే (Maine) రాష్ట్రంలో మంగళవారం కాల్పుల ఘటన చోటు చేసుకొంది. బౌడోయిన్‌ ప్రాంతంలోని ఓ ఇంటిలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. అనంతరం 295వ నంబర్‌ హైవేపై కూడా పలు వాహనాలపై కాల్పులు చోటు చేసున్నాయి. పోర్ట్‌ల్యాండ్‌ - బౌడోయిన్‌ మధ్య ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు