Gali Janardhan Reddy: సుప్రీంకోర్టులో గాలి జనార్దన్‌రెడ్డికి చుక్కెదురు

కర్ణాటక మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Published : 19 Apr 2023 13:20 IST

దిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో బెయిల్‌ నిబంధనల సడలింపునకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. 

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్దన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. బెయిల్‌ నిబంధనలు సడలించడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఎన్నికల తర్వాత మళ్లీ పిటిషన్‌ వేసేందుకు గాలి జనార్దన్‌ రెడ్డి తరఫు న్యాయవాది అనుమతి కోరారు. ఆ విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అక్రమ మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డితో పాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరు 5న జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని