IMD: తెలంగాణలో మోస్తరు వర్షాలు: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు 21వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

Updated : 19 Apr 2023 16:10 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం వాయవ్య తెలంగాణ, గురువారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది.

భానుడి భగభగలే..

బుధవారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41- 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య.. గురువారం పలు చోట్ల 40-42 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 21వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. బుధవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో గరిష్ఠంగా 43, 44 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో 21వ తేదీ నుంచి 35-37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని