Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Apr 2023 17:03 IST

1. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులు నిలిపివేసిన సుప్రీం

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ వ్యవహారంపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అవినాష్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎదురుదెబ్బ తగిలినా విడిచిపెట్టొద్దు: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటీఆర్‌ సూచన

ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే గిరిజన ఉన్నత విద్యావంతులకు ముఖ్యమంత్రి గిరజన ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (సీఎంఎస్‌టీఈఐ) ఎంతగానో సహాయపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పథకంలో భాగంగా ఇవాళ 24 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సీఎంఎస్‌టీఈఐ యూనిట్లను ఆయన పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం నుంచి కూడా పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యవస్థాపకులు రావాలని ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అప్రమత్తంగా ఉండండి.. జనసైనికులకు పవన్‌ బహిరంగలేఖ

జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. మాట్లాడేముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులను ఆయన బహిరంగ లేఖ రాశారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించేందుకు, భావజాలాన్ని కలుషితం చేసేందుకు కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జీవో నంబర్‌-1పై త్వరగా తేల్చండి: ఏపీ హైకోర్టుకు సుప్రీం సూచన

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌-1 వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. లైంగిక ఆరోపణల వివాదం.. బ్రిజ్‌ భూషణ్‌పై సుప్రీంకు రెజ్లర్లు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై స్టార్‌ రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఇది సుప్రీంకోర్టుకు చేరింది. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ వినేశ్‌ ఫొగాట్‌ సహా ఏడుగురు రెజ్లర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అవి.. వారెన్‌ బఫెట్ మనసు తొలుస్తున్నాయట..!

ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌(Warren Buffett)ను కొన్ని విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఏ సంస్థ దూసుకెళ్తుందో ముందుగానే గ్రహించి పెట్టుబడులు పెట్టే ఈ ధనవంతుడు.. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను కలవరానికి గురిచేస్తోన్న విషయాలను వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పట్నా హైకోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. ‘మోదీ’ అనే ఇంటిపేరును కించపర్చారంటూ బిహార్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 30న పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ 25వ తేదీన తమ ఎదుట వాంగ్మూలం నమోదు నిమిత్తం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వాట్ ఏ స్టేడియం.. కళ్లు విప్పార్చి చూడాల్సిందే!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తుంటారు. అలాగే దేశంలోని అద్భుతాలను ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్‌బాల్‌ స్టేడియం ఫొటోలను పంచుకున్నారు. అలాగే అక్కడ మ్యాచ్ చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎంగిలి పిజ్జా.. ఎవరికి కావాలి.. ట్రంప్‌ మార్క్‌ ఆఫర్‌..!

చేతిలో చాటంత పిజ్జా పెట్టుకొని.. దానిలోని ఓ ఎంగిలి ముక్కను మాత్రమే తీసి ఎవరికైనా కావాలా అని అడిగితే ఎలా ఉంటుంది.. ఇలాంటి వెకిలిపనే చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. తన అభిమానులకు ఎంగిలి పిజ్జా ముక్కను ఆఫర్‌ చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఫోర్ట్‌మేయర్స్‌లో చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ రిపోర్టరు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వారంతా నాకు ఫేర్‌వెల్‌ ఇవ్వడానికి వచ్చినట్లున్నారు: ఎంఎస్ ధోనీ

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ (KKR vs CSK) 49 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అజింక్య రహానె (71*), కాన్వే (56), శివమ్‌ దూబె (50) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 235/4 భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా 188/8 స్కోరుకే పరిమితమైంది. జేసన్ రాయ్ (61), రింకు సింగ్ (53*) రాణించినా ఓటమి మాత్రం తప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని